Begin typing your search above and press return to search.

అంతర్జాతీయంగా మన అందం మెరిసింది

By:  Tupaki Desk   |   4 Dec 2016 7:55 AM GMT
అంతర్జాతీయంగా మన అందం మెరిసింది
X
అందాల పోటీలో మన అమ్మాయిలు మెరవటం కొత్త కాకున్నా.. ఈ మధ్యన కాస్త ఎక్కువైంది. తాజాగా మరోసారి మన అమ్మాయి అందం ప్రపంచ దేశాల భామల్ని తోసిరాజంది. బెంగళూరుకు చెందిన శ్రీనిధి రమేష్ శెట్టి.. తాజాగా జరిగిన మిస్ సుప్రా 2016 టైటిల్ ను సొంతం చేసుకుంది. పోలెండ్లో జరిగిన ఈ పోటీలో పాల్గొన్న వివిధ దేశాల సుందరాంగుల్ని పక్కకు నెట్టి.. అంతిమ పోటీల్లో విజేతగా నిలిచింది.

కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి చెందిన శ్రీనిధి.. బాల్యం మొత్తం అక్కడే సాగింది. చదువుసంధ్యలు అక్కడే సాగాయి. బెంగళూరు మహవీర్ జైన్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివిన ఈ భామ.. ఒక ఐటీ సంస్థలో రెండేళ్లు ఉద్యోగం చేయటం విశేషం. మోడలింగ్ మీద ఉన్న ఆసక్తితో.. ఓపక్క ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు తన మోడలింగ్ ప్రయత్నాల్లో సక్సెస్ కావటం విశేషం. ఫ్యాషన్ రంగం మీద ఉన్న ఆసక్తితో చేస్తున్న ఐటీఉద్యోగానికి చెల్లుచీటి ఇచ్చేసిన ఈ భామ.. అంతర్జాతీయ పోటీలో విజేతగా నిలవటం విశేషంగా చెప్పాలి. మరీ.. కొత్త అందాన్ని ఏ ‘‘ఉడ్’’ వెండితెరకు పరిచయం చేస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/