Begin typing your search above and press return to search.

‘‘ఐపిఎల్’’ బెట్టింగ్ కోసం పెళ్లానే పణంగా పెట్టాడే

By:  Tupaki Desk   |   29 May 2016 5:08 AM GMT
‘‘ఐపిఎల్’’ బెట్టింగ్ కోసం పెళ్లానే పణంగా పెట్టాడే
X
మహాభారతంలో జూదంలో పెళ్లాన్ని పణంగా పెట్టిన ధర్మరాజు ఉదంతం అందరూ వినే ఉంటారు. అలాంటి దరిద్రపు పనినే తాజాగా చేసిన ఒక నికృష్టుడి కోసం ఇప్పుడు పోలీసులు వెతుకుతున్నారు. కాన్పూర్ కు చెందిన ఒక ప్రబుద్ధుడికి షేర్ మార్కెట్.. ఐపీఎల్ బెట్టింగ్ లాంటి ఉండాల్సిన అవలక్షనాలన్నీ ఉన్నాయి. దీంతో.. తనకున్న ఆస్తిపాస్తుల్ని మొత్తంగా పోగొట్టుకున్న అతగాడు.. తాజాగా ఐపీఎల్ జూదం కోసం తన భార్యనే పణంగా పెట్టేశాడు.

తాజాగా పెట్టిన బెట్టింగ్ లో పెళ్లాన్ని సైతం పణంగా పెట్టిన ఈ దరిద్రుడి కారణంగా.. సదరు మహిళ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. బెట్టింగ్ లో సొంతం చేసుకున్నానంటూ సదరు యువతి పట్ల గెలుచుకున్న వాళ్లు వేధించటం మొదలెట్టారు. అసభ్యంగా ప్రవర్తించటంతో ఆ మహిళ తట్టుకోలేకపోయింది. తనకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పాలని నిర్ణయించుకున్న ఆమెకు అండగా ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు రావటంతో ఆమెపోలీసుల్ని ఆశ్రయించింది.

పెళ్లి అయిన నాటి నుంచి తన భర్త తనను వేధించేవాడని.. షేర్ మార్కెట్ లో మొత్తం ఆస్తిని పొగొట్టుకొని.. అదనపు కట్నం తేవాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ బాధితమహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వాపోయింది. దీంతో.. స్పందించిన పోలీసులు ఈ దరిద్రుడ్ని అదుపులోకి తీసుకునేందుకు వెతుకులాట మొదలెట్టారు.