Begin typing your search above and press return to search.

ఎంపీని కాల్ గ‌ర్ల్ అనేసి.. జైల్లో కూర్చున్నాడు!

By:  Tupaki Desk   |   23 Nov 2017 4:12 PM GMT
ఎంపీని కాల్ గ‌ర్ల్ అనేసి.. జైల్లో కూర్చున్నాడు!
X
ప్ర‌స్తుత స‌మాజంలో ఏది అందుబాటులోకి వ‌చ్చినా... దానిని అనుస‌రించే జ‌నాల సంఖ్య కొన్ని గంట‌ల్లోనే వేల‌ను దాటి ల‌క్ష‌ల‌ను దాటేఇస కోట్ల‌కు చేరుకుంటోంది. దీనికి వార్తా ఛానెళ్లో - ప‌త్రిక‌లో కార‌ణం కాదు. కేవ‌లం సోష‌ల్ మీడియానే. సోష‌ల్ మీడియా శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో ఏ అంశ‌మైనా క్షణాల్లో జ‌నం వ‌ద్ద‌కు వెళ్లిపోతోంది. మ‌రి ఈ త‌ర‌హా వేగంతో సాగుతున్న సోష‌ల్ మీడియాతో లాభ‌మా? న‌ష్ట‌మా అంటే.. రెండూ ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో గతంలో నిర్భ‌య‌పై జ‌రిగిన అత్యాచారం... మొత్తం దేశాన్నే ఓ కుదుపు కుదిపేసింది. ఢిల్లీలోని వీధులు యువ‌త హోరుతో హడ‌లెత్తిపోయింది. రాష్ట్ర‌ప‌తి - ప్ర‌ధాని - పార్ల‌మెంటు త‌దిత‌ర ప్ర‌ధాన భ‌వ‌నాలున్న రైసినా హిల్స్ కూడా నాటి యువ‌త ఆందోళ‌న‌కు భీతిల్లిపోయాయ‌నే చెప్పాలి. అయితే నాటి ఆందోళ‌న‌లో పాలుపంచుకోవాలంటూ ఏ ఒక్క‌రికి ఆహ్వానం అంద‌లేదు. ఆ ఉద్య‌మానికి క‌ర్త‌ - క‌ర్మ‌ - క్రియ మొత్తం సోష‌ల్ మీడియానే.

మ‌రి జ‌నాన్ని అంత‌గా ప్ర‌భావితం చేసిన సోష‌ల్ మీడియా ఇప్పుడు వెర్రి త‌లలు వేస్తుండ‌టం అంద‌రినీ ఆందోళ‌న‌కు గురి చేసే అంశ‌మే. అయినా సోష‌ల్ మీడియా పాత్ర ఇందులో ఏమీ లేకున్నా.. దీనిని వినియోగిస్తున్న కొంద‌రు నెటిజ‌న్ల కార‌ణంగా మొత్తం సోష‌ల్ మీడియాకే పాపం చుట్టుకుంటోంది. అయినా సోష‌ల్ మీడియాను ఇంత‌గా ఏకిపారేయ‌డానికి గ‌ల కార‌ణాలేంట‌న్న విష‌యానికి వ‌స్తే... ఓ మ‌హిళా ఎంపీని సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఈ ఆక‌తాయి ఏకంగా కాల్ గ‌ర్ల్ అంటూ సంబోధించాడు. నిజ‌మా? అంటే... నిజ‌మే మ‌రి, అలా ఆ నెటిజ‌న్ కాల్ గ‌ర్ల్ అంటూ సంబోధించిన మ‌హిళా ఎంపీ సాదాసీదా వ్య‌క్తి కూడా కాదాయే. మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా సుదీర్ఘ కాలం పాటు కేంద్ర కేబినెట్ లో కీల‌క శాఖ‌ల మంత్రిగా, బీసీసీఐని సుదీర్ఘ కాలం పాటు త‌న చెప్పు చేత‌ల్లో పెట్టుకున్న వ్య‌క్తిగా శ‌ర‌ద్ ప‌వార్ తెలుసు క‌దా. ప‌వార్ కూతురు సుప్రియా సూలే... ఇప్పుడు ఎంపీ. ప‌వార్ పార్టీ ఎన్సీపీ టికెట్‌పైనే పోటీ చేసిన సూలే ఎంపీగా విజ‌యం సాధించారు.

అయినా సూలేను ఆ నెటిజ‌న్ అంత మాట అన‌డానికి గ‌ల కార‌ణ‌మేంట‌న్న విష‌యానికి వ‌స్తే... కాంగ్రెస్‌ను విభేదించి ప‌వార్ నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పేరిట వేరు కుంప‌టి పెట్టుకున్నారు. ఇది జ‌రిగి చాలా కాల‌మే అవుతోంది. అయితే ఎప్పుడు అవ‌కాశం ఉన్నా.. కాంగ్రెస్ పార్టీకి మ‌ద్దతు ఇస్తున్న ప‌వార్‌... కేంద్రంలో ఆ పార్టీకి వెన్నుద‌న్నుగా నిలుస్తున్నారు. ఈ క్ర‌మంలో మొన్న మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ శ‌త జ‌యంతి ఉత్స‌వాలు జ‌రిగాయి. ఆ ఉత్స‌వాల‌కు ఎన్సీపీ ఎంపీగా ఉన్న సూలే హాజ‌ర‌య్యారు. ఈ సింగిల్ కార‌ణాన్ని ప‌ట్టుకున్న ఓ నెటిజ‌న్‌... ఎన్సీపీ ఎంపీగా ఉంటూ ఇందిరా గాంధీ జ‌యంతిలో ఎలా పాల్గొంటారంటూ ప్ర‌శ్నించాడు. ఆ ప్ర‌శ్న‌తోనే స‌రిపెట్టుకోకుండా సూలేను ఏకంగా కాల్ గ‌ర్ల్ అంటూ సంబోధించాడు. దీంఓ చిర్రెత్తుకొచ్చిన సూలే.. అత‌డిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స‌ద‌రు నెటిజ‌న్‌ ను అదుపులోకి తీసుకుని జైలులో పెట్టేశారు.