Begin typing your search above and press return to search.

కొత్త చ‌ర్చ‌.. ఆయ‌న‌ది జాతీయ మీసం..!

By:  Tupaki Desk   |   26 Jun 2019 5:51 AM GMT
కొత్త చ‌ర్చ‌.. ఆయ‌న‌ది జాతీయ మీసం..!
X
జాతీయ‌వాదం పేరుతో దెబ్బేసిన మోడీ మాష్టారికి మించిన జాతీయవాదం త‌మ‌లో ఉంద‌న్న భావ‌న దేశ ప్ర‌జ‌ల‌కు క‌లిగేందుకు కాంగ్రెస్ ప‌డుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. చేత‌లు కాలిన త‌ర్వాత ఆకులు ప‌ట్టుకున్న చందంగా జాతీయవాదం విష‌యంలో మొద‌ట్నించి నిర్ల‌క్ష్యం చేసిన కాంగ్రెస్ చింతిస్తోంది. జాతీయ‌వాదానికి మేలిముసుగు వేసేసి.. లౌకిక‌వాదం పేరుతో కాంగ్రెస్ ఆడిన డ్రామాల‌కు మోడీ అండ్ కో పుణ్య‌మా అని అలాంటి వాటి ఆట‌లకు కాలం చెల్లిపోయింది.

ఈ విష‌యాన్ని గుర్తించిన కాంగ్రెస్ ఇప్పుడు త‌న పాత ఇమేజ్ ను తుడిపేసుకొని కొత్త త‌ర‌హా ఇమేజ్ కోసం విప‌రీతంగా త‌పిస్తోంది. దేశ‌భ‌క్తి మాట విన్నంత‌నే మోడీ పేరు గుర్తుకు వ‌చ్చే తీరును మార్చాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉంది. కానీ.. అదేమంత ఈజీ కాద‌న్న విష‌యం ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతుంది. దీంతో.. అవ‌స‌రం ఉన్నా.. లేని విష‌యాల్ని కెలుకుతూ ఇప్పుడు వార్త‌ల్లోకి వ‌స్తోంది. వీరి మాట‌ల్లోనూ.. వారు చేస్తున్న ప్ర‌పోజ‌ల్స్ తో వారి ఆరాటం ఇట్టే అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి.

తాజాగా అలాంటి ఉదంత‌మే ఒక‌టి చోటు చేసుకుంది.కాంగ్రెస్ పార్టీ పార్ల‌మెంట‌రీ నేత ఆధీర్ రాజన్ చౌదరీ తాజాగా కొత్త ప్ర‌పోజ‌ల్ తెర మీద‌కు తెచ్చారు. ఇంత‌వ‌ర‌కూ ఉన్న జాతీయ జెండా.. జాతీయ గీతం.. జాతీయ జంతువు.. జాతీయ ప‌క్షి వ‌రుస‌లో జాతీయ మీసం అంటూ వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్ద‌మాన్ మీసాన్ని గుర్తింపు ఇవ్వాల‌న్న ప్ర‌పోజ‌ల్ ను తెర మీద‌కు తెచ్చారు.

భార‌త గ‌గ‌న‌త‌లంలోకి వ‌చ్చిన పాక్ యుద్ధ విమానాన్ని త‌రుముతూ పొర‌పాటున పాక్ గ‌గ‌న‌త‌లంలోకి వెళ్లిన అత‌గాడి విమానాన్ని కూల్చివేయ‌టం.. పాక్ చేతికి చిక్క‌టం.. త‌ర్వాత ఆయ‌న విడుద‌లై దేశానికి రావ‌టం తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో అభినంద‌న్ మీస‌క‌ట్టు దేశ‌భ‌క్తికి నిద‌ర్శ‌నంగా.. జాతీయ‌వాదాన్ని పెంచేలా మారింది. క్రికెట్ మ్యాచుల సంద‌ర్భంగా ప‌లువురు అభిమానులు అభినంద‌న్ మీస‌క‌ట్టును ఇమిటేట్ చేస్తూ ఉండ‌టం క‌నిపిస్తోంది. దేశ వ్యాప్తంగా అభినంద‌న్ మీస‌క‌ట్టు కొత్త ట్రెండ్ గా మార‌టం తెలిసిందే. ఇలాంటి విష‌యాల్ని ప్ర‌స్తావించ‌టం ద్వారా ఇమేజ్ కంటే కూడా కాంగ్రెస్ పొలిటిక‌ల్ క‌క్కుర్తి క‌నిపిస్తుందే త‌ప్పించి క‌మిట్ మెంట్ క‌నిపించ‌ద‌న్న విష‌యాన్ని ఆ పార్టీ ఎప్పుడు గుర్తిస్తుందో..?