Begin typing your search above and press return to search.

ఈ వని మాటలు వినాల్సిన అవసరం ఉంది

By:  Tupaki Desk   |   29 Sep 2016 5:31 AM GMT
ఈ వని మాటలు వినాల్సిన అవసరం ఉంది
X
గడిచిన కొద్ది నెలలుగా ‘‘వని’’ పేరు మీడియాలో మార్మోగింది. ఈ కశ్మీరీ తీవ్రవాదిని ఎన్ కౌంటర్ చేయటంతో కశ్మీర్ లో పెద్ద ఎత్తున కలకలం రేగ‌టం.. దీన్ని పాక్ ఒక అవకాశంగా మార్చుకొని.. భారత్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తోంది. అంతర్జాతీయ వేదికల మీద కశ్మీర్ లో ఏదో జరుగుతోందంటూ అసత్యాల్ని ప్రచారం చేస్తుంది. కశ్మీరీల గుండెల్లో ఏదో ఉందంటూ మాయమాటలు చెబుతూ.. కొందరిని రెచ్చగొడుతోంది. అయితే.. అలాంటి మాటలు నిజం కావని.. సగటు కశ్మీరీ ఏం కోరుకుంటున్నారన్న విషయాన్ని చెప్పుకొచ్చారు మరో వని. కాకపోతే.. మొదట చెప్పిన వనికి.. ఈ వనికి చాలా తేడా ఉంది. పేరులో చివరి రెండు అక్షరాలు మాత్రమే కలిసే ఈ వని (నబీల్ అహ్మద్ వని) బీఎస్ ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పరీక్షలో టాపర్ గా నిలిచారు.

కశ్మీరీ యువత గురించి ఇతగాడి మాటల్ని చూస్తే.. కశ్మీరీ యువతలో 95 శాతం మంది దేశానికి సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నారని.. కేవలం ఐదు శాతం మంది మాత్రమే తప్పుడు మార్గంలో వెళుతున్నారని స్పష్టం చేశాడు. ఆర్మీలో చేరాల్సిందిగా జమ్ముకశ్మీర్ యువతను కోరుతున్నట్లు చెబుతున్న వని.. డిఫెన్స్ లోకి రావటం వల్ల దేశానికి సేవ చేసే గొప్ప అవకాశం లభిస్తుందని వ్యాఖ్యానిస్తున్నాడు. ఇప్పటికైతే పరిస్థితి బాగోలేదన్న మాటను చెప్పిన అతగాడు.. హింసతోనో.. రాళ్లదాడితోనే పరిస్థితి మార్చలేమని.. సానుకూల దృక్ఫథం.. చర్చల ప్రక్రియతో మాత్రమే ప్రశాంతతను సాధిస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తాడు. ఇతని మాటకు తగ్గట్లే తాజాగా.. కశ్మీర్ లోయలో నిర్వహించిన పోలీసు ఉద్యోగాల సెలక్షన్ కోసం భారీ ఎత్తున కశ్మీరీ యువత అప్లికేషన్లు పెట్టుకోవటం.. వేలాది మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుండటం కనిపిస్తుంది.