Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ ఎఫైర్స్ అన్నీ చెబుతాను - కత్తి మహేష్

By:  Tupaki Desk   |   19 Jan 2018 1:05 PM GMT
పవన్ కళ్యాణ్ ఎఫైర్స్ అన్నీ చెబుతాను - కత్తి మహేష్
X
పవర్ స్టార్ పవన్ క‌ళ్యాణ్‌ ను టార్గెట్ చేస్తూ ఇటు సోషల్ మీడియా - అటు మీడియా ఛానెల్స్ లో గత కొన్నిరోజులుగా కత్తి మహేష్ సంచలన కామెంట్స్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌ట్రెండు రోజులుగా ఇది మ‌రింతగా హీటెక్కింది. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్‌ కు మింగుడు ప‌డ‌టం లేదు. ఫ్యాన్స్ నుంచి వార్నింగ్‌ లు సైతం వ‌స్తున్నాయి. అయినా కత్తి మహేష్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప‌వ‌న్‌ తో పాటుగా సినీ న‌టి పూనం కౌర్‌ పైనా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. దీంతో నిన్న ఓ ప్ర‌ముఖ చాన‌ల్ వ‌ద్ద క‌త్తిపై ఫ్యాన్స్ ఇబ్బందిక‌రంగా ప్ర‌వ‌ర్తించిన తీరు క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రోమారు క‌త్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌రో టీవీ ఛాన‌ల్‌ లో మాట్లాడుతూ "మిస్టర్ పవన్ కల్యాణ్.. పూణెలో రేణూ దేశాయ్ ఇంటికి నువ్వెప్పుడైనా వెళ్లావా? పూణెలో ఫోర్ సీజన్స్ అనే ఓ హోటల్ ఉంది.. ఇక్కడ చిరంజీవీ గారికి కానీ మీ అమ్మగారికి కానీ అత్తగారింటికి వెళ్తున్నానని చెప్పి నువ్వెళ్లి ఎక్కడ దాక్కూనే వాడివి మిస్టర్ పవన్" అని సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఇదిలాఉండ‌గా మ‌రిన్ని ఇదే త‌ర‌హా కామెంట్లు కూడా క‌త్తి చేశారు.

పవన్ కళ్యాణ్ ఫాం హౌస్ విషయాలన్నీ చెబుతాను. ఇప్పుడున్న పెళ్లాం ఇంకా నిద్రపోతూ ఉంటే.... రాత్రి 3 గంటలకు ఎవరిని పంపడానికి తన సొంత కారు వేసుకుని పవన్ మెయిన్ రోడ్డుకు వస్తాడో మాట్లాడదాం...

పవన్ కళ్యాణ్ గురంచి అతడి ఎఫైర్ల గురించి మాట్లాడుకుందాం. ఎంత మంది ప్రొడ్యూసర్లను నాశనం చేశాడు, ఎంత మంది అమ్మాయిలతో ఇతడికి ఎఫైర్ ఉంది.

ఎంత మంది అమ్మాయిలను త్రివిక్రమ్ అనే డైరెక్టర్ సెటిల్మెంట్ చేసి లాస్ట్ 2 ఇయర్స్ లో పంపించాడు. వీటన్నింటి గురించి మాట్లాడుదాం...

ఆ తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడుదాం. దీనికి మీరు సిద్ధమేనా? అంటూ కత్తి ప్రశ్నించారు.

త‌న సొంత భార్య‌ను కాపాడుకోలేని వ్య‌క్తి రాష్ర్టాన్ని ఎలా కాపాడుకుంటార‌ని క‌త్తి మ‌హేష్ ప్ర‌శ్నించారు. అయితే ఈ చ‌ర్చ‌లో పాల్గొన్న వ్యక్తి క‌త్తి కామెంట్ల‌ను త‌ప్పుప‌ట్టారు. అయిన‌ప్ప‌టికీ క‌త్తి మ‌హేష్ త‌న దూకుడును కొన‌సాగించ‌డం గ‌మ‌నార్హం. కాగా, త‌న‌పై ప‌వ‌న్ ఫ్యాన్స్ దాడి చేశారని పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే.