Begin typing your search above and press return to search.

ఆమ్రపాలిపై కోర్టుకెళ్లిన ధోనీ

By:  Tupaki Desk   |   12 April 2018 11:49 AM GMT
ఆమ్రపాలిపై కోర్టుకెళ్లిన ధోనీ
X
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై ఆయ‌న కోర్టుకు వెళ్లాడు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. గత 6-7 సంవత్సరాల నుంచి మహేంద్రసింగ్ ధోనీ ఆమ్రపాలి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌ గా ఉంటున్నారు. గడువులోగా హౌసింగ్ ప్రాజెక్టు పనులు పూర్తిచేయకపోవడంతో గృహ వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహంవ్యక్తం చేశారు. నిర్మాణ సంస్థ నుంచి ప్రచార బాధ్యతల నుంచి తప్పుకోవాలని రెసిడెంట్లు కోరుతూ పలు ట్వీట్లను ధోనీకి ట్యాగ్ చేశారు. దీంతో ఏప్రిల్ 2016లో రియాల్టీ సంస్థ ప్రచారకర్త బాధ్యతల నుంచి ధోనీ తప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది.

2011 ప్రపంచకప్‌లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో జట్టులోని ప్రతిఒక్క ఆటగాడికి నోయిడాలోని ఆమ్రపాలి డ్రీమ్ వ్యాలీ ప్రాజెక్టులో రూ.9కోట్ల విలువ చేసే అద్భుతమైన ఇండిపెండెంట్ విల్లాను గిప్ట్‌గా ఇస్తానని 2016లో ఆమ్రపాలి సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ధోనీకి రూ.కోటి విలువ గల విల్లాను ప్రజెంట్ చేసిన సంస్థ... మిగతా జట్టు సభ్యులకు రూ.55 లక్షల విలువగల విల్లాలను బహుకరించింది. ఆమ్ర‌పాలి సంస్థ తనకు సుమారు రూ.150కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని కొన్నేళ్లుగా ఆసంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నానని ధోని ఫిర్యాదులో పేర్కొన్నారు.

స్టార్ క్రికెటర్లు ధోనీ - భువనేశ్వర్ కుమార్ - సౌతాఫ్రికా క్రికెటర్ డుప్లెసిస్‌ల బ్రాండింగ్ వ్యవహారాలను రితీ స్పోర్ట్స్ పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో అమ్రపాలికి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో రితీ స్పోర్ట్స్ సంస్థ దావా దాఖలు చేసింది. బ్రాండింగ్, మార్కెటింగ్ కార్యకలాపాలకు సంబంధించి రియల్ ఎస్టేట్ సంస్థ మాకు డబ్బులు చెల్లించట్లేదని రితీ స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ పాండే తాజాగా వెల్లడించారు. దాదాపు రూ.200 కోట్ల వరకు తమకు బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆయన అన్నారు.