Begin typing your search above and press return to search.

ధోనీ క్రికెట్‌ కు సెల‌వు... సైన్యంలో మేజ‌ర్‌ గా ఎంట్రీ

By:  Tupaki Desk   |   20 July 2019 11:12 AM GMT
ధోనీ క్రికెట్‌ కు సెల‌వు... సైన్యంలో మేజ‌ర్‌ గా ఎంట్రీ
X
ప్రపంచ్‌ కప్ సంగ్రామం ముగిసింది. భారత జట్టు ఖ‌చ్చితంగా గెలుస్తుంది అని ఆశించిన 120 కోట్ల మంది అభిమానుల ఆశలను అడియాశలు చేస్తూ మన జట్టు తన పోరాటాన్ని సెమీస్‌ లో ముగించేసింది. సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. టోర్నీ ఆరంభం నుంచి ఒక్క సెమీస్‌తో మ్యాచ్‌ మినహా అన్ని మ్యాచ్‌ ల్లోనూ వరుస విజయాలతో జైత్రయాత్ర కంటిన్యూ చేసిన‌ భారత్.. సెమీస్‌ కు వచ్చేసరికి చేతులు ఎత్తేసింది. ఆ మ్యాచ్‌ లో భారత్ ఓట‌మికి వర్షంతో పాటు అనేక కారణాలు ఉన్నా... ఎక్కువ మంది మాత్రం సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీని టార్గెట్గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ - ఇంగ్లాండ్ - సెమీస్‌ లో న్యూజిలాండ్‌ తో జ‌రిగిన మ్యాచ్‌ ల‌లో సైతం ధోనీ ఆటతీరును చాలా మంది తప్పుబట్టారు. ప్రపంచకప్ మొత్తం మీద‌ ఎక్కువమందికి టార్గెట్ అయిన క్రికెటర్ ఖ‌చ్చితంగా ధోనీయే అని చెప్పాలి. ఇదిలా ఉంటే ప్రపంచ కప్ ముగియడంతో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళుతోంది. ఆదివారం వెస్టిండీస్ పర్యటనలో పాల్గొనే 15 మంది సభ్యులను బిసిసిఐ ఎంపిక చేయనుంది. ధోని ఈ 15 మంది సభ్యులలో ఒకడిగా ఉంటాడా లేదా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

అయితే బిసిసిఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ధోని వెస్టిండీస్ పర్యటన నుంచి తనంతట తానుగా తప్పుకోనున్నట్టు బిసిసిఐకి ఇప్పటికే స్పష్టం చేశాడ‌ట‌. ఈ రెండు నెలలు ఆర్మీలో చేరి లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో సేవ‌లు అందిస్తానని చెప్పినట్టు సమాచారం. ఈ విష‌యాన్ని బీసీసీఐ అధికారి కూడా ఒక‌రు ధృవీక‌రించారు. ధోనీ త‌ప్పుకోవ‌డంతో వ‌న్డేల‌కు యువ వికెట్ కీప‌ర్ రిషిబ్ పంత్‌కు దాదాపు చోటు ఖాయ‌మైన‌ట్టే.

ఇక టెస్ట్ మ్యాచ్‌ ల‌కు గాను వృద్ధిమాన్ సాహా పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. అయితే ధోనీ ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత త‌న‌పై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌వ‌చ్చ‌ని అంద‌రూ అనుకున్నా... అనూహ్యంగా రెండు నెల‌ల పాటు సెల‌వు పెట్టి మ‌రీ సైన్యంలో మేజ‌ర్‌గా సేవ‌లందించాల‌నుకోవ‌డం ఆశ్చ‌ర్య‌మే. ప్ర‌స్తుతానికి త‌న‌పై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో మ‌ళ్లీ త‌న‌ను తాను ఫ్రూవ్ చేసుకునేందుకే ధోనీ ఇలా తెలివైన ఎత్తుగ‌డ వేశాడా ? అన్న చ‌ర్చ కూడా స్టార్ట్ అయ్యింది.