Begin typing your search above and press return to search.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో మ‌రోసారి మామే సీఎం!

By:  Tupaki Desk   |   9 Nov 2018 12:48 PM GMT
మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో మ‌రోసారి మామే సీఎం!
X
క‌ర్ణాట‌క ఉప ఎన్నిక‌ల‌లో బీజేపీకి షాక్ త‌గిలిన సంగ‌తి తెలిసిందే. 4-1తో ఆ ఎన్నిక‌ల‌లో ప‌రాయ‌జ‌యం పాలైన క‌మ‌ల‌నాథులకు ఆ ఓట‌మి చెంప‌పెట్టువంటిద‌ని ప్ర‌తిప‌క్షాలు అభిప్రాయ‌ప‌డ్డాయి. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ఓట‌మి నేప‌థ్యంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతోన్న 5 రాష్ట్రాల ఎన్నిక‌ల‌లో బీజేపీకి ఎదురుగాలి వీస్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌కు ఊర‌ట నిచ్చేలా ఓ ప్రీ పోల్ స‌ర్వే వెల్ల‌డైంది. మధ్యప్రదేశ్‌ లో బీజేపీ మ‌రోసారి గెలుపు బావుటా ఎగ‌రేస్తుందని టైమ్స్ నౌ-సీఎన్ ఎక్స్ ప్రీపోల్ స‌ర్వే లో తేలింది. ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రికార్డు స్థాయిలో నాలుగోసారి ముఖ్యమంత్రి కాబోతున్నార‌ని ఆ సర్వేలో వెల్లడైంది. 230 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 122 సీట్లలో గెలుస్తుందని - మ్యాజిక్ ఫిగ‌ర్ 116 క‌న్నా మరో ఆరు సీట్లు ఎక్కువగా ద‌క్కించుకుంటుద‌ని వెల్ల‌డైంది.

రాజస్థాన్ - మధ్యప్రదేశ్ - చత్తీస్‌ గఢ్ లలో బీజేపీ అధికారంలో ఉండగా - మిజోరాంలో కాంగ్రెస్ - తెలంగాణలో టీఆర్ ఎస్ అధికారంలో ఉంది. అయితే - మధ్యప్రదేశ్ - చత్తీస్‌ గఢ్‌ లలో కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వ‌నుంద‌ని - కానీ, మ‌రోసారి బీజేపీ అధికారం ద‌క్కించుకుంటుంద‌ని పలు సర్వేలు చెబుతున్నాయి. తెలంగాణలో కూడా టీఆర్ ఎస్ మ‌రోసారి గెలిచే చాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. రాజస్థాన్ కాంగ్రెస్ వశమవుతుందని ప్రీ పోల్ సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో బీజేపీకి 128 సీట్లు - కాంగ్రెస్ పార్టీకి 85 సీట్లు - బీఎస్పీకి 8 సీట్లు వస్తాయని ఈ స‌ర్వేలో వెల్లడైంది. శివరాజ్‌ ను 40.11 శాతం మంది - కమల్‌ నాథ్‌ ను 20.32 శాతం మంది - జ్యోతిరాదిత్య సింధియాను 19.65 శాతం మంది కోరుకుంటున్నారని తేలింది. మధ్యప్రదేశ్‌ లో నవంబర్ 28న ఎన్నికలు జరగనుండ‌గా - డిసెంబర్ 11న ఫలితాలు వెలువ‌డ‌బోతోన్న సంగ‌తి తెలిసిందే.