Begin typing your search above and press return to search.

ధోని మరో రికార్డు..

By:  Tupaki Desk   |   12 Jan 2019 11:12 AM GMT
ధోని మరో రికార్డు..
X
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత్ తరుఫున ధోని వన్డేల్లో పదివేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచారు. శనివారం ఆస్ట్రేలియాతో 334వ వన్డే ఆడుతున్న ధోని భారత్ తరుఫున 10వేల పరుగులు పూర్తి చేసిన ఐదో ఆటగాడిగా అరుదైన ఘనతను సాధించాడు.

టీమిండియా తరుఫున ఇప్పటివరకు సచిన్ 18426 పరుగులు - సౌరవ్ గంగూలి (11363) - రాహుల్ ద్రావిడ్ (10889) - విరాట్ కోహ్లీ (10235) 10 వేల పరుగుల మైలురాయిని దాటారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ధోని ఈ ఘనత సాధించారు.

తిరువనంతపురం వేదికగా నవంబర్ 1న జరిగిన మ్యాచ్ లో ధోనికి బ్యాటింగ్ కు అవకాశం వస్తే 10వేల పరుగుల మైలురాయిని దేశంలోనే అందుకునేవాడే.. కానీ ధోనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో అర్థసెంచరీ సాధించి 10వేల పరుగుల మైలురాయి అందుకున్నారు.

ధోని 10వేల పరుగులు చేయడంపై బీసీసీఐ - టీమిండియా మాజీ క్రికెటర్లు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధోనిపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.