Begin typing your search above and press return to search.

మన ఎంపీలకు ఇంకా ఏమేం కావాలంటే..

By:  Tupaki Desk   |   28 Sep 2016 6:02 PM GMT
మన ఎంపీలకు ఇంకా ఏమేం కావాలంటే..
X
ప్రజలకు సేవ చేయటం.. వారి బతుకుల్ని మార్చటమే లక్ష్యంగా చెప్పుకునే మన ఎంపీలకు ఏం కావాలి? అన్నప్రశ్న వేస్తే.. వారి నుంచి వచ్చే సమాధానం వింటే చిన్నపాటి షాక్ తినాల్సిందే. ప్రస్తుతం వారికస్తున్న లక్షల రూపాయిలు జీతాలు.. రాయితీ మీద పార్లమెంటు క్యాంటీన్ లో కల్పించే భోజన వసతి మాత్రమే కాదు.. పెద్ద ఎత్తున వసతులు ఏ మాత్రం సరిపోవట్లేదట. తాజాగా ప్రభుత్వం.. ప్రైవేటు ఎయిర్ లైన్ సంస్థల్ని పార్లమెంటరీ ప్యానల్ కలిసింది.

ఈ సందర్భంగా ఎంపీలు కోరుకుంటున్న డిమాండ్లను ఎయిర్ లైన్స్ ముందు ఉంచింది. వాటిని చూసిన ఎయిర్ లైన్స్ సంస్థలు నిర్మోహమాటంగా సాధ్యం కాదని తేల్చి చెప్పేశాయి. దేశాన్ని పాలించే ఎంపీల కోర్కెల్ని కాదంటారా? అని సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు కోరిన కోర్కెల్ని చూస్తే.. ఒళ్లు మండిపోవటం ఖాయం. ఇంతకీ వారు కోరుకున్న కోర్కెల చిట్టా చూస్తూ.. ఎయిర్ టికెట్లు తక్కువ ధరకే అమ్మాలి. ఆఖరి నిమిషంలో టికెట్ బుక్ చేసుకున్నా.. డిస్కౌంట్ రేట్లకే టికెట్లు ఇవ్వాలని కోరారు. అంతేకాదు.. సీట్లలో కూడా వారికంటూ కోటా ఉండాలని కోరారు. ఇవే కాకుండా మన ఎంపీలు కోరిన మరిన్ని కోర్కెల్ని చూస్తే..

= ఎయిర్ పోర్ట్ లలో ఎంపీలకు ప్రత్యేక ఏర్పాట్లు..కౌంటర్లు ఉండాలి

= ప్రోటోకాల్ పాటిస్తూ ఎంపీలకు సహకరించేందుకు అధికారుల్ని ఏర్పాటు చేయాలి

= ఉచితంగా ఫుడ్ ఇవ్వాలి

= చివరి నిమిషాల్లో వచ్చినా తొందరగా చెక్ చేసి పంపించేయాలి

ఇలా.. వారు తమ కోర్కెల చిట్టాను ముందు ఉంచారు. ఇందుకు వారి వాదన ఏమిటంటే.. ఇలాంటి వసతలు కల్పించటం తప్పేం కాదని.. ఎందుకంటే సెలవంటూ లేకుండా నిత్యం ప్రజాసేవలో తరించే తమకు ఆ మాత్రం సౌకర్యాలు కల్పించరా? అని ప్రశ్నిస్తున్నారు. ఎంపీల కోర్కెల చిట్టా గురించి తెలిసినోళ్లంతా సిరాకు పడిపోతున్నారు. ఇప్పటికే వారు చేస్తున్న సేవ ఎంతో అందరికి తెలిసిందేనని.. పదవిని ప్రజాసేవ కంటే కూడా దర్పం ప్రదర్శించేలా వారి డిమాండ్లు ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.