ఎస్పీవై రెడ్డి టీడీపీ అభ్యర్థికి సపోర్టు చేస్తున్నట్లా?

Sat Aug 12 2017 22:32:57 GMT+0530 (IST)

వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి నంద్యాల ఉప ఎన్నికలో తాను ఎటువైపు అనే విషయంలో చంద్రబాబు అండ్ కోను సంశయంలో పడేశారు. చంద్రబాబుపై తాను అసంత్రుప్తిగా ఉన్నానని చెప్పడంతో పాటు... తప్పనిసరి పరిస్థితుల్లో భూమా ఫ్యామిలీకి మద్దతిస్తున్నాని ఆయన చెప్పడంతో ఎస్పీవై రెడ్డి ఇంతకీ టీడీపీ అభ్యర్థికి సపోర్టు చేస్తున్నారా లేదా అన్న విషయం ఆ పార్టీలో మొదలైందట.
    
నంద్యాల ఉపఎన్నికలో  సైకిల్ దూసుకుపోతుందని ఆయన చెప్పినప్పటికీ ఆ తరువాత ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం టీడీపీకి నష్టం కలిగించేలా ఉన్నాయి. నంద్యాల ఉపఎన్నికలో గెలిచేవారే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ఆయన అన్నారు.  నంద్యాల ఉప ఎన్నికల్లో తన కూతురికి సీటివ్వాలని కోరినా చంద్రబాబు వినలేదని... అందుకే ఆయనపై అలిగానని ఆయన చెప్పారు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో భూమా కుటుంబానికి మద్దతు ఇచ్చానని ఆయన వెల్లడించారు.
    
దీంతో ఎస్పీవై రెడ్డిపై టీడీపీలో అనుమానాుల మొదలయ్యాయట. ఆయన పార్టీ విజయానికి ప్రయత్నం చేసే సూచనలు లేవని వినిపిస్తోంది. అంత ఓపెన్ గా ఈ విషయాలన్నీ చెప్పాక ఆయన టీడీపీ అభ్యర్థి కోసం పనిచేస్తారని ఎలా అనుకుంటామని టీడీపీ నేతలే అంటున్నారు.