Begin typing your search above and press return to search.

దెయ్యంకొంప మాట‌కు నిండు మ‌న‌సుతో సారీ!

By:  Tupaki Desk   |   28 May 2017 9:51 AM GMT
దెయ్యంకొంప మాట‌కు నిండు మ‌న‌సుతో సారీ!
X
మాట జారితే వెన‌క్కి తీసుకోలేం. సాదాసీదా జ‌నాలు ఒక మ‌ట ఎక్కువ‌త‌క్కువ మాట్లాడినందువ‌ల్ల జ‌రిగే న‌ష్టంతో పోలిస్తే.. కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న వారు.. ప్ర‌ముఖులు ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడి అడ్డంగా బుక్ అవుతుంటారు. తాజాగా అలాంటి వ్యాఖ్య‌లు చేసి.. లేనిపోని స‌మ‌స్య‌ల్లో ఇరుక్కున్నారు టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి.

ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌తో పాటు కోస్తాకు చెందిన ప‌లువురు విద్యావంతులు.. మేధావులు విప‌రీతంగా అభిమానించి.. ఆరాధించే ఆంధ్రా విశ్వ‌విద్యాల‌యాన్ని త‌న మాట‌తో తీవ్రంగా హ‌ర్ట్ చేశారు ఎమ్మెల్సీ మూర్తి. ఏయూలో మ‌హానాడును నిర్వ‌హించే విష‌యంపై చెల‌రేగిన వివాదం నేప‌థ్యంలో జ‌రిగిన మాట‌ల్లో మూర్తిగారు తొంద‌ర‌ప‌డి మాట తూలేశారు. ఏయూను దెయ్యాల కొంప‌గా అభివ‌ర్ణించారు. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. చ‌దువుల నిల‌యాన్ని అంతేసి మాట‌లు అంటారా? అంటూ ఫైర్ అయిన వారు ఎంద‌రో.

ఇంత దారుణ‌మైన వ్యాఖ్య‌ను మ‌రో విశ్వివిద్యాల‌యాన్ని స్థాపించిన రాజ‌కీయ నేత అన‌టం మ‌రింత‌మందిని బాధించింది. ఈ వ్యాఖ్య ఓ వివాదంగా మార‌ట‌మే కాదు.. రాజ‌కీయంగా ఆయ‌న ఇమేజ్‌ను దారుణంగా దెబ్బ తీసింది. అధికార‌పార్టీకి చెందిన నేత నోటి నుంచి వ‌చ్చిన ఈ మాట‌తో ఏపీ స‌ర్కారు ఇబ్బంది ప‌డే ప‌రిస్థితి. దీంతో.. దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగ‌క త‌ప్ప‌లేదు.

అయితే.. చేసిన త‌ప్పును వెంట‌నే ఒప్పేసుకొని చెంప‌లేసుకుంటే బాగోద‌ని అనుకున్నారేమో కానీ.. మూర్తి మాష్టారు.. త‌న త‌ప్పును ఒప్పుకోవ‌టానికి అస్స‌లు ఒప్పుకోలేదు. రెండు రోజుల క్రితం కూడా.. తాను అస్స‌లు త‌ప్పుగా మాట్లాడ‌లేద‌ని.. మీడియాలో వ‌చ్చిందంతా వ‌క్ర‌భాష్య‌మే త‌ప్పించి తాను అన్న మాట‌లు ఎంత‌మాత్రం కాద‌న్నారు. అంత పెద్ద మ‌నిషి అంత నిసిగ్గుగా అబ‌ద్ధాలు చెప్పేయ‌టం.. త‌మ‌కు ఏమాత్రం సంబంధం లేకున్నా.. త‌ప్పు త‌మ మీద నెట్టేయ‌టంపై మీడియా ప్ర‌తినిధులు ప‌లువురు ఆగ్ర‌హాన్నివ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉంటే.. తాజాగా మూర్తిగారి మాట‌లు ఒక్క‌సారి మారిపోయాయి. ఎవ‌రి ప్ర‌భావ‌మో ఏమో కానీ.. తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు తాను చాలా బాధ ప‌డుతున్న‌ట్లుగా చెప్పారు. పొర‌పాటున త‌న నోటి నుంచి మాట‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. త‌ప్పు మాట్లాడ‌టం మామూలే. కానీ.. దాన్ని క‌ప్పిపుచ్చుకోవ‌టం కోసం మ‌ర‌క మీడియా మీద వేసేసిన మూర్తి.. తాజాగా మాత్రం చెంప‌లేసుకొని మ‌రీ సారీ చెప్పేశారు. త‌న మాట‌ల‌కు వ‌ర్సిటీ ఉప కుల‌ప‌తి.. అధ్యాప‌కులు.. విద్యార్థులు.. మేధావులు క్ష‌మించాల‌ని వేడుకున్నారు. ఈ ఏడుపేదో ముందే ఏడ్చేసి ఉంటే.. ఇష్యూ ఇంత దూరం వ‌చ్చేది కాదు క‌దా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/