Begin typing your search above and press return to search.

మే 28న కృష్ణా జిల్లా పేరు మారుతోందా?

By:  Tupaki Desk   |   21 Jan 2017 7:00 AM GMT
మే 28న కృష్ణా జిల్లా పేరు మారుతోందా?
X
13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ లో మూడు జిల్లాలకు వ్యక్తుల పేర్లే ఉన్నాయి. వైఎస్ ఆర్ కడప జిల్లా - పొట్టి శ్రీరాములు జిల్లా - ప్రకాశం జిల్లా అంటూ నేతల పేర్లు పెట్టుకున్నాం. త్వరలో మరో జిల్లాకు కూడా పేరు మారబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో ఈ మేరకు ఫైలు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా పేరును మాజీ ముఖ్యమంత్రి - టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరిట మార్చబోతున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఎన్టీఆర్ జయంతి అయిన మే 28న ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఎన్టీ రామారావు పేరుతో జిల్లా ఏర్పాటు డిమాండు చాలా కాలంగానే ఉంది. అయితే.. తాజాగా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మొన్న ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో మరోసారి ఈ డిమాండు చేశారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉన్నట్లు వినిపిస్తోంది. ఓ ఫ్యాక్షన్ నాయకుడి పేరును(వైఎస్ రాజశేఖర్ రెడ్డి) జిల్లాకు పెట్టినప్పుడు… తెలుగువారికి కీర్తిని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్ పేరును ఆయన పుట్టిన కృష్ణా జిల్లాకు పెట్టడంతో తప్పేంటని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. చంద్రబాబు కూడా ఇదే దిశగా ఆలోచిస్తున్నారని.. దీనికి సంబంధించి త్వరలో క్లారిటీ వస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.

కాగా.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే రాష్ట్రంలోని మూడు జిల్లాలకు మాజీ సీఎంల పేర్లు ఉన్నట్లు అవుతుంది. ప్రకాశం పంతులు, వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా గతంలో సీఎంలుగా పనిచేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/