Begin typing your search above and press return to search.

వైఎస్సార్సీపీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే రిటర్న్స్!

By:  Tupaki Desk   |   26 March 2019 1:26 PM GMT
వైఎస్సార్సీపీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే రిటర్న్స్!
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన పలువురు నేతలు తీరా ఎన్నికల సమయానికి మళ్లీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోకే వస్తూ ఉండటం గమనార్హం. ఇప్పటికే పలువురు ఫిరాయింపు నేతలు తిరిగి వచ్చారు. వరపుల సుబ్బారావు తెలుగుదేశం పార్టీలో తనకు అన్యాయం జరిగిందని అంటూ కంటతడి పెట్టి మరీ వైసీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

ఇక కర్నూలు సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుక కథ కూడా ఇదే. కొన్నాళ్ల కిందట తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఆమె.. తీరా అక్కడ టికెట్ దక్కకపోయే సరికి బాగా ఫీల్ అయ్యింది. బుట్టా రేణుకకు టికెట్ అని లోకేష్ కూడా ప్రకటించారు. అయితే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి వచ్చే సరికి బుట్టా రేణుకను టీడీపీ వాళ్లు పట్టించుకోలేదు. దీంతో ఆమె సారీ చెప్పి జగన్ చెంతకు చేరిపోయింది. తిరిగి వైసీపీ కండువాను వేయించుకుంటూ.. జగన్ కు క్షమాపణలు చెప్పుకుంది ఆమె.

ఇక ఆమె మాత్రమే కాకుండా.. ఎస్వీ మోహన్ రెడ్డి కూడా అదే బాటన నడిచారు. బావ భూమా నాగిరెడ్డితో పాటు ఫిరాయించిన ఎస్వీ మోహన్ రెడ్డి.. ఇప్పుడు మళ్లీ వైసీపీలో చేరిపోయారు. కర్నూలులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తరఫున ఎస్వీ మోహన్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. కర్నూలులో తిరిగి వైఎస్సార్సీపీ జెండానే పాతుతాం అని ఎస్వీ అంటుండటం గమనార్హం.

ఇక తాజాగా అలాంటి జాబితాలోనే నిలిచారు డేవిడ్ రాజు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన డేవిడ్ రాజు ఆ తర్వాత ఫిరాయించారు. టీడీపీలో టికెట్ దక్కలేదు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరారు ఆయన.