Begin typing your search above and press return to search.

130 ప్రాజెక్టులను పూర్తి చేసిన ఎంఈఐఎల్

By:  Tupaki Desk   |   15 May 2019 4:34 AM GMT
130 ప్రాజెక్టులను పూర్తి చేసిన ఎంఈఐఎల్
X
హైదరాబాద్ - మే 15:ఇంజినీరింగ్ - ఇన్‌ ఫ్రా దిగ్గజం ఎంఈఐఎల‌్ గత ఆర్థిక సంవత్సరంలో 130 ప్రాజెక్టులను పూర్తి చేసి రికార్డుల్లోకి ఎక్కింది. లిఫ్ట్ ఇరిగేషన్ - తాగునీరు - విద్యుత్ ఉత్పత్తి - సరఫరా - పంపిణీ - గ్యాస్ ప్రాసెసింగ్ - గ్యాస్ పంపిణీ తదితర రంగాలలో ప్రాజెక్టులను పూర్తి చేసింది. ప్రాజెక్టులను నిర్ణీత గడువు కన్నా ముందే నాణ్యతతో రాజీపడకుండా పూర్తి చేయడం ఎంఈఐఎల‌్ ప్రత్యేకత. రికార్డు సమయంలో400 /220కేవీ సబ్‌ స్టేషన్‌ ను నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ - ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ - లిమ్కా బుక్‌ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎంఈఐఎల‌్ ఎక్కింది. అలాగే రాగేశ్వరీ వద్ద గ్యాస్ ప్రాసిసింగ్ యూనిట‌్‌ ను కూడా కేవలం ఆరునెలల కాలంలోనే నెలకొల్పి రికార్డులను తిరగరాసింది.

అత్యంత సంక్లిష్టమైన గ్యాస్ ప్రాసెసింగ్ యూనిట‌్‌‌ ను రాజస్థాన్‌ లోని రాగేశ్వరీ వద్ద ఎంఈఐఎల్ నెలకొల్పింది. కెయిర్న్‌ ఇండియా నుంచి ఆగస్టు 2018 లో ఆర్డర్‌ ను పొందిన ఎంఈఐఎల్ సెప్టెంబర్‌ లో పనులు ప్రారంభించి కేవలం ఆరునెలల కాలంలో మార్చి 2019 నాటికి పూర్తి చేసింది. 80ఎంఎంఎస్‌ సీఎఫ్‌ ఈడీ గ్యాస్‌ ప్రాసెసింగ్‌ సామర్థ్యం గల ఈ ప్రాజెక్టును 18నెలల పాటు ఎంఈఐఎల్ నిర్వహించనుంది. కేవలం ఆరునెలల కాలంలో గ్యాస్‌ ప్రాసెసింగ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడం కూడా ఒక రికార్డే. వనరుల సమీకరణ నుంచి ఇంజినీరింగ్ పనులను ఏకబిగిన యుద్ధప్రాతిపదిన చేపట్టడంతో రికార్డు సమయంలో పూర్తి చేయగలిగింది. ఎంఈఐఎల్ పూర్తిచేసిన 130 పైగా ప్రాజెక్టు ల్లో కొన్ని పూర్తిస్థాయిలోని ప్రాజెక్టులుగా కాగా మరికొన్ని ప్రాజెక్టు ల్లో భాగమైన నిర్దేశించిన పనికి సంబంధించిన ప్యాకేజీలు కూడా ఉన్నాయి. ప్రతీ ప్యాకేజీని సాంకేతికంగా ఒక ప్రాజెక్ట్ గానే పరిగణిస్తారు.

జలవిద్యుత్‌ కేంద్రం

సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టు (నర్మాద)లోని సౌరాష్ట్ర కాలువపై 15 మెగావాట్ల జల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం గల మూడు యూనిట్లను ఎంఈఐఎల్ నెలకొల్పుతున్నది. ఇందులో రెండు యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించగా - మూడో యూనిట్‌ నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తికి సిద్ధంగా ఉంది. ఒక్కో యూనిట్‌ లో 5 మెగావాట్ల సామర్థ్యం గల మూడు టర్బైన్ లను ఏర్పాటు చేసింది. ఈ జలవిద్యుత్‌ కేంద్రాలను వచ్చే ఐదేండ్ల పాటు ఎంఈఐఎల్ నిర్వహించనుంది.

వైటీపీఎస్‌ ప్రాజెక్టు

కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాలో ఏర్పాటవుతున్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం కోసం వైటీపీఎస్‌ ప్రాజెక్టును ఎంఈఐఎల్ చేపట్టింది. ఈ ప్రాజెక్టును కూడా సకాలంలో పూర్తి చేయడం ద్వారా ఎంఈఐఎల్ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. కృష్ణా నదీ జలాలను థర్మల్‌ ప్లాంట్‌ కు పంపింగ్‌ చేయడం - బూడిదతో కలిసి తిరిగి వచ్చే కలుషిత నీటిని యాష్‌ బండ్‌ కు తరలించి - అక్కడ నీటిని ఎంఈఐఎల్ ని శుద్ది చేసి తిరిగి థర్మల్‌ ప్లాంట్‌ కు పంపించడం ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశ్యం. ఇంతటి సంక్లిష్టమైన ప్రాజెక్టును కూడా సకాలంలో పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా జాక్‌ వెల్‌ - పంప్‌ హౌజ్‌ - పైప్‌ లైన్‌ లను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్‌

ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్‌ ను సరఫరా చేసేందుకు ముఖ్యమైన సబ్‌ స్టేషన్ల నిర్మాణాన్ని ఎంఈఐఎల్ దిగ్విజయంగా పూర్తి చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్‌1 సబ్‌ స్టేషన్లను పూర్తి చేయడం ద్వారా వివిధ పంపింగ్‌ స్టేషన్లకు విద్యుత్‌ ను అందించేందుకు రంగం సిద్ధం అయింది. కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులోని ప్యాకేజి 8 భాగంగా రామడుగు400కేవి సబ్‌ స్టేషన్‌ ను నిర్మించి చార్జ్‌ చేసింది. మొత్తం పనులన్నింటినీ పూర్తి చేసుకుని చార్జ్‌ చేసిన మొదటి సబ్‌ స్టేషన్‌ కూడా ఇదే. ప్యాకేజి 8అండర్‌ గ్రౌండ్‌‌ లో నిర్మించిన ప్రపంచంలోనే అతి భారీ మోటార్లు ఏడింటికి ఈ సబ్‌ స్టేషన్‌ ను అనుసంధానం చేశారు. ఒక్కోక్కటి139 మెగావాట్ల సామర్థ్యం గల ఇంతటి భారీ మోటార్లు ప్రపంచంలో మరెక్కడా లేవు. వీటికి బాహుబలి మోటార్లు అని కూడా పేరు. దీనితో పాటే సుందిళ్ల వద్ద 400 200కేవీ సబ్‌ స్టేషన్‌ ను నిర్మాణాన్ని కూడ పూర్తి ఎంఈఐఎల్ పూర్తి చేసింది. ఈ సబ్‌ స్టేషన్‌ నుంచి సుందిళ్ల పంప్‌‌ హౌజ్‌ కు విద్యుత్‌ సరఫరా చేయడంతో పాటు అన్నారం - మేడిగడ్డలలో ని 220కేవీ సబ్‌ స్టేషన్లకు కూడా విద్యుత్‌ ను సరఫరా చేయనుంది. అన్నారం సబ్‌ స్టేషన్‌ నుంచి అన్నారం పంప్‌ హౌజ్‌ లోని 8 యూనిట్లకు - మేడిగడ్డ సబ్‌ స్టేషన్‌ నుంచి మేడిగడ్డ్ పంప్‌ హౌజ్‌ లోని11 యూనిట్లకు విద్యుత్‌ ను అందించనున్నారు. ఇవే కాకుండా - విద్యుత్ సబ్ స్టేషన్లలో కలికిరి - పొదిలి-సత్తెనపల్లి - గజ్వేల్ - కేతిరెడ్డిపల్లి - మహేశ్వరం సబ్ స్టేషన్లతో పాటు నర్సాపూర్ లిలో లైన్ ను సకాలంలో పూర్తి చేసింది.

నెల్లూరుకు తాగునీరు

నెల్లూరు నగరంతో పాటు పరిసర గ్రామాలకు తాగునీటిని అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టును ఎంఈఐఎల్ పూర్తి చేసి అందరి మన్ననలను అందుకుంటున్నది. మొత్తం 70వేల కుటుంబాలకు శుద్ది చేసిన రక్షిత మంచినీటి సరఫరా ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశ్యం. పొదలకూరు మండలంలోని విరువూరు వద్ద పెన్నా నదిపై ఇన్‌ టేక్‌ వెల్‌ ను నిర్మించి 544కిలోవాట్ల సామర్థ్యం గల మూడు వెర్టికల్‌ టర్బైన్ పంప్‌ సెట్లను ఏర్పాటు చేసింది. రోజుకు 122మిలియన్‌ లీటర్ల నీటిని శుద్ధి చేయగల సామర్థ్యంతో మహమదాపూర్‌ లో నీటి శుద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 88.90 కిలోమీటర్ల డీఐ పైప్‌ లైన్‌ - 40 కిలోమీటర్ల ఎంఎస్‌ పైప్‌ లైన్‌ ఏర్పాటు చేయడంతో పాటు ఐదేండ్ల పాటు ఈ ప్రాజెక్టను ఎంఈఐఎల్ నిర్వహించనుంది.

దేశవ్యాప్తంగా రక్షిత తాగునీటి ప్రాజెక్టులు

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో రక్షిత తాగునీటి పథకాల ప్రాజెక్టులను ఎంఈఐఎల్ పూర్తి చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ కింద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని సెగ్మెంట్లతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ తోపాటు నల్గొండ - మంగపేట - పాలేరు వరంగల్ - దుమ్ముగూడెం - అదిలాబాద్ ఫేజ్ 1 - 2సెగ్మెంట్లను పూర్తిచేసి - తాగునీటిని సరఫరా చేస్తున్నది. అదేవిధంగా కర్ణాటకలోని దాసరహళ్లి - రాజస్థాన్ లోని కోట్రీ - అసింధ్ - పాలి - షాపుర ప్రాజెక్టులు - ఒడిషాలోని భువనేశ్వర్ బల్క్ - కియోన్ జహార్ - ప్రాజెక్టులతోపాటు ఉత్తరప్రదేశ్ లోని వారణాసి - ఆగ్రా ప్రాజెక్టులను పూర్తి చేసింది.

ఎత్తి పోతల ప్రాజెక్టులు

సాగునీటి సరఫరా కోసం చేపట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్ లోని పురుషోత్తపట్నం - కొండవీటివాగు - హంద్రీనీవా ఫేజ్-2 - చింతలపూడి ఎత్తిపోతల పథకాలను పూర్తిచేసింది. అలాగే కర్ణాటకలో కోలార్ - కన్వ - ఉత్తూర్ ప్రాజెక్టులు - ఒడిషాలో మెగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లోని ఆరు లిఫ్ట్ లను పూర్తి చేసి నీటి సరఫరాలను చేపట్టింది.