Begin typing your search above and press return to search.

సంచ‌ల‌న మార్పులు...వీరే టీఆర్ ఎస్ అభ్య‌ర్థులు

By:  Tupaki Desk   |   21 March 2019 4:47 PM GMT
సంచ‌ల‌న మార్పులు...వీరే టీఆర్ ఎస్ అభ్య‌ర్థులు
X
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత‌, ముఖ్యమంత్రి క‌ల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. లోక్‌ సభ అభ్యర్థులపై సుదీర్ఘ క‌స‌ర‌త్తు చేసిన కేసీఆర్ ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను మార్చారు. న‌ల్ల‌గొండ‌, మ‌హ‌బూబాబాద్, మహబూబ్‌ నగర్, చేవెళ్ల, మ‌ల్కాజ్‌ గిరి, ఖ‌మ్మం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ అభ్య‌ర్థుల విష‌యంలో మార్పులు చేశారు. కాగా, తాజా ఈరోజు చేరిన ఇద్ద‌రు నేత‌ల‌కు టికెట్ ద‌క్కింది. ఉద‌యం కండువా క‌ప్పుకొన్న నామా నాగేశ్వ‌ర‌రావు, బోర్లకుంట వెంకటేశ్‌ కు టికెట్లు కేటాయించారు.

కాగా, మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌ యాద‌వ్ కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్‌ కు సికింద్రాబాద్ టికెట్ కేటాయించారు. ఎంపీ అభ్య‌ర్థులంద‌రిలో అతి చిన్న వ‌య‌సు సాయికిర‌ణ్‌ దే కావ‌డం గ‌మ‌నార్హం. గ‌త కొద్దికాలంగా ఏపీ రాజకీయాల‌పై క్రియాశీలంగా స్పందిస్తున్న త‌ల‌సానికి ద‌క్కిన బ‌హుమానంగా ఈ టికెట్ అని ప‌లువురు పేర్కొంటున్నారు.

టీఆర్ ఎస్ అభ్యర్థులు వీరే
1. కరీంనగర్ : బోయినపల్లి వినోద్ కుమార్
2. పెద్దపల్లి : బోర్లకుంట వెంకటేశ్ నేతకాని
3. ఆదిలాబాద్ : గోడెం నగేశ్
4. నిజామాబాద్ : కల్వకుంట్ల కవిత
5. జహీరాబాద్ : బీబీ పాటిల్
6. మెదక్ : కొత్త ప్రభాకర్ రెడ్డి
7. వరంగల్ : పసునూరి దయాకర్
8. మహబూబాబాద్ : మాలోత్ కవిత
9. ఖమ్మం : నామా నాగేశ్వరరావు
10. భువనగిరి : బూర నర్సయ్య గౌడ్
11. నల్గొండ : వేమిరెడ్డి నరసింహ రెడ్డి
12. నాగర్ కర్నూల్ : పోతుగంటి రాములు
13. మహబూబ్‌నగర్ : మన్నె శ్రీనివాస రెడ్డి
14. చేవెళ్ల : డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి
15. సికింద్రాబాద్ : తలసాని సాయికిరణ్ యాదవ్
16. మల్కాజిగిరి : మర్రి రాజశేఖర్ రెడ్డి
17. హైదరాబాద్ : పుస్తె శ్రీకాంత్