Begin typing your search above and press return to search.

రాహుల్‌ కు రేవంత్ ఇచ్చిన లిస్ట్‌ తో ఎస‌రు వీళ్ల‌కే

By:  Tupaki Desk   |   22 Oct 2017 10:16 AM GMT
రాహుల్‌ కు రేవంత్ ఇచ్చిన లిస్ట్‌ తో ఎస‌రు వీళ్ల‌కే
X

తెలంగాణ టీడీపీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేరువ అయ్యే ఎపిసోడ్‌లో మ‌రో సంచ‌ల‌న వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. రేవంత్ వ‌స్తే త‌మ `ప్ర‌భ` మ‌స‌క బారుతుంద‌ని ఇప్ప‌టికే తెలంగాణ కాంగ్రెస్‌ లోని ప‌లువురు ప్ర‌ముఖులు క‌ల‌వ‌ర‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు కొంద‌రు బ‌హిరంగంగానే త‌మ అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేశారు. పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి - సీనియ‌ర్ నేత వీహెచ్ వంటి కొంద‌రు నేత‌లు రేవంత్ రాక‌ను స్వాగ‌తిస్తున్నారు. అయితే ఈ భిన్నాభిప్రాయాల‌లోనే..కాంగ్రెస్ నేత‌ల‌ను షాక్‌ కు గురిచేసే ఓ వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది.

ఢిల్లీకి ప్ర‌త్యేకంగా వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి స‌మావేశం అయిన‌పుడు తాను కాంగ్రెస్‌ లో చేరుతున్న స‌మ‌యంలో ప‌లువురు నేత‌లు సైతం త‌న వెంట వ‌స్తార‌ని ప్ర‌క‌టించినట్లు మీడియాలో వార్త‌లు వ‌చ్చిన‌ సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీకి రేవంత్ ఓ లిస్ట్ ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం...ఈ పేర్ల ప్ర‌కారం టికెట్లు ఇవ్వాల‌ని రేవంత్ డిమాండ్ చేశార‌ట‌.

మక్తల్
డీకే అరుణ ఫ్యామిలీ కొత్తకోట దయాకర్‌ రెడ్డి
(కాంగ్రెస్) (రేవంత్ టీమ్)

వరంగల్
నాయిని రాజేందర్‌ రెడ్డి వేం నరేందర్‌ రెడ్డి
(కాంగ్రెస్) (రేవంత్ టీమ్)

నిజామాబాద్ రూరల్
ఆకుల లలిత అరికెల నర్సారెడ్డి
(కాంగ్రెస్) (రేవంత్ టీమ్)

భూపాలపల్లి
గండ్ర వెంకటరమణారెడ్డి గండ్ర సత్యనారాయణరావు
(కాంగ్రెస్) (రేవంత్ టీమ్)

కాగజ్‌ నగర్
గోసుల శ్రీనివాస్ రావి శ్రీనివాస్
(కాంగ్రెస్) (రేవంత్ టీమ్)

సత్తుపల్లి
సంభాని చంద్రశేఖర్ సండ్ర వెంకటవీరయ్య

దేవరకొండ
జగన్ లాల్‌ నాయక్ బీల్యా నాయక్
(కాంగ్రెస్) (రేవంత్ టీమ్)

సూర్యాపేట
రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి పటేల్ రమేష్‌ రెడ్డి
(కాంగ్రెస్) (రేవంత్ టీమ్)

బాల్కొండ
అనిల్ డి. రాజారాం యాదవ్
(కాంగ్రెస్) (రేవంత్ టీమ్)

మునుగోడు
పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి ఫ్యామిలీ కంచర్ల భూపాల్‌ రెడ్డి
(కాంగ్రెస్) (రేవంత్ టీమ్)

సత్తుపల్లి
సంభాని చంద్రశేఖర్ సండ్ర వెంకటవీరయ్య
(కాంగ్రెస్) (రేవంత్ టీమ్)