Begin typing your search above and press return to search.

విమానం మిస్సింగ్..4 ఏళ్ల స‌స్పెన్స్‌ కు తెర‌

By:  Tupaki Desk   |   15 May 2018 6:11 AM GMT
విమానం మిస్సింగ్..4 ఏళ్ల స‌స్పెన్స్‌ కు తెర‌
X
నాలుగేళ్ల ఉత్కంఠకు తెర‌ప‌డింది. 2014 మార్చి 8న - 239 మంది ప్రయాణికులతో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయలుదేరిన బోయింగ్ 777 విమానం కొద్ది సేపటికే అదృశ్యమైన సంగ‌తి తెలిసిందే. ఇది దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలి ఉంటుందని అనుమానించారు. అక‌స్మాత్తుగా అదృశ్య‌మైన ఈ మలేషియా విమానం కోసం ఆస్ట్రేలియా ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బ్యూరో హిందూ మహా‌సముద్రంలో విస్తృతంగా గాలింపులు చేప‌ట్టింది. ఎంహెచ్‌370 అదృశ్యంపై ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డ్ ఆఫ్ కెన‌డాకు చెందిన‌ మాజీ సీనియ‌ర్ ఇన్వెస్టిగేష‌న్ అధికారి ల్యారీ వ్యాన్స్ సంచ‌ల‌న విష‌యాల‌ను పంచుకొని ఈ విమాన దుర్ఘ‌ట‌న ఉత్కంఠ‌కు తెర‌దించారు.

మిస్టరీగా మిగిలిపోయిన ఎంహెచ్‌ 370 విమానం ఆచూకీని కనిపెట్టేందుకు మలేషియా అమెరికా కంపెనీతో భారీ ఒప్పందం చేసుకుంది. అదృశ్యమైన విమానాన్ని గుర్తిస్తే 70 మిలియన్‌ డాలర్లు మ‌న క‌రెన్సీలో దాదాపు 445 కోట్లు అందజేయనున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ విమానం మిస్సింగ్‌ ఎపిసోడ్‌పై తాజాగా ల్యారీ సంచ‌ల‌న విష‌యాన్ని పంచుకున్నాడు. మలేషియా ఎంహెచ్‌ 370 విమానం అదృశ్యం అతి పెద్ద మిస్టరీగా మిగిలిపోయింద‌ని పేర్కొంటూ కెప్టెన్ జ‌హ‌రీ ఇందుకు బాధ్యుడ‌ని ల్యారీ వివ‌రించారు. బోయింగ్ 777 పైల‌ట్ మ‌రియు ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ సైమ‌న్ హార్డీ ప్ర‌కారం కెప్టెన్ జ‌హారీ చేసిన త‌ప్పిదం వ‌ల్లే ఈ విమానంలో ఉన్న వారు ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపారు. థాయ్‌లాండ్‌, మ‌లేషియాకు చెందిన విమాన‌యాన సిగ్న‌ల్స్‌ను ఏ మాత్రం పాటించ‌లేద‌ని, పైగా ఆ రెండు దేశాల స‌రిహ‌ద్దుల్లో త‌న విమానాన్ని నియంత్ర‌ణ కోల్పోయి న‌డ‌ప‌డం వ‌ల్ల ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంద‌ని తెలిపారు. త‌న‌ను తాను చంపేసుకోవాల‌ని భావించిన పైల‌ట్ వ‌ల్ల ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు.

కాగా, ఈ విచార‌ణ చేప‌ట్టిన ఆస్ట్రేలియా ట్రాన్స్‌పోర్ట్‌ సేఫ్టీ బ్యూరో (ఏటీఎస్‌ బీ) అనూహ్య రీతిలో క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. ఈ విచార‌ణ‌పై తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన సంద‌ర్భంగా ``ఎంహెచ్‌ 370 ప్రయాణికులు బాధిత కుటుంబాలకు మేం న్యాయం చేయలేకపోయాం.. మమ్మల్ని క్షమించండి`` అంటూ.. రీసెర్చ్‌ ఏటీఎస్‌ బీ ప్రకటించింది. ఆధునిక ప్రపంచంలో ఈ విమాన అదృశ్యం ఎవరూ ఊహించలేనిది అని ఏటీఎస్‌బీ తెలిపింది. ఎంహెచ్‌ 370 అదృశ్యం అనేది విమానయాన చరిత్రలోనే అతి పెద్ద విషాదమని ఏటీఎస్‌ బీ చీఫ్‌ కమిషనర్‌ గ్రెగ్‌ హూడ్‌ చెప్పారు. ``ఈ విమానం కోసం నిర్వహించిన సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రపంచంలోనే అతి పెద్దది.. అయినా బాధిత కుటుంబాలకు మాత్రం న్యాయం చేయలేకపోయాం` అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంహెచ్‌ 370 అదృశ్యమైన ప్రాంతంగా భావిస్తున్న ఆస్ట్రేలియా పడమటి ప్రాంతంలోని 2,800 కిలో మీటర్ల పరిధిని అణువణువు శోధించామని.. అలాగే సముద్రగర్భంలో లక్షా 20 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో సోనార్‌ టెక్నాలజీతో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వ హించినట్లు ఆయన చెప్పారు. ఈ విషాద సంఘ‌ట‌న ఒక వ్య‌క్తి మాన‌సిక స‌మ‌స్య కార‌ణంగా చోటుచేసుకోవ‌డం తాజాగా సంచ‌ల‌నంగా మారింది.