Begin typing your search above and press return to search.

బాబూ....లోకేష్ ఈ అవినీతి ఏంటి..?

By:  Tupaki Desk   |   26 Sep 2018 4:05 AM GMT
బాబూ....లోకేష్ ఈ అవినీతి ఏంటి..?
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు - ఆయన కుమారుడు ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ దారుణమైన అవినీతిపరుల....వారిద్దరి అవినీతికి ఎలాంటి అడ్డుగోడలు ఉండవా.....అవుననే అంటున్నారు మాజీ న్యాయమూర్తి శ్రవణ్‌ కుమార్. ముఖ్మమంత్రి - మంత్రి అవినీతికి అడ్డు లేకుండా పోతుందంటూ న్యాయమూర్తి శ్రవణ్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్‌ లో రాజధాని నిర్మణం సహా పోలవరం ప్రాజేక్టు నిర్మాణం, వివిధ ప్రభుత్వ పథకాల అమలులో అవినీతిపై ఈ తండ్రి కొడుకుల పాత్ర ఉందని మాజీ న్యాయమూర్తి శ్రవణ్ కుమార్ కోర్టుకు తెలిపారు. ఆంధ్రపదేశ్ రాజధాని నిర్మాణంలోను - పోలవరం ప్రాజేక్టులోను దారుణమైన అవినీతి జరుగుతోందంటూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వారి ఆరోపణలు - విమర్శలకు తోడుగా మాజీ న్యాయమూర్తి శ్రవణ్ కుమార్ దాఖాలు చేసిన పిటిషన్ కూడా బలం చేకూరుస్తోంది. ఏ రాజకీయ పార్టీకి గాని వివిధ సంఘాలను కాని సంబంధం లేని మాజీ న్యాయమూర్తి ఈ అవినీతి కేసు వేయడంతో తెలుగుదేశం పార్టీతో సహా అన్నీ రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి.

సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలు కోర్టులో నిరూపణ కాకపోయిన ప్రజలలో మాత్రం చంద్రబాబు నాయుడు అవినీతిపై ఓ అంచన వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తాజాగా తన కుమారుడు ఐటి శాఖ మంత్రి లోకేష్ కూడా ప్రభత్వంలో భాగస్వౌమ్యం కావడంతో వారి అవినీతిపై సర్వాత్ర చర్చ జరుగుతోందని వారంటున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి రాజధాని నిర్మాణం - పోలవరం ప్రాజేక్టులలో అవినీతి రాజ్యమేలుతోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలన్నీ అవాస్తావాలని తన రాజకీయ మనుగడ కోసం చేస్తున్నవేనని అధికార తెలుగుదేశం నాయకులు తిప్పి కొడుతున్నారు. అయితే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని - న్యాయ వ్యవస్థతతో సూదీర్ఘ అనుభవ మున్న మాజీ న్యాయమూర్తి శ్రవణ్ కుమార్ కేసు వేయడంతో అందరి ద్రుష్టి ఈ అవినీతి ఆరోపణలపై పడింది. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదని, ప్రజాక్షేమం ప్రజల డబ్బు వ్రుధా కాకూడదని ఈ కేసు వేసేనని శ్రవణ్ కుమార్ మీడియాకు చెప్పారు. తెలుగుదేశం పార్టీయే కాకుండా అవినీతికి పాల్పడిన ఏ పార్టీపైనైనా తాను ఇలాగే వ్యవహరిస్తాను అని అన్నారు. గడచిన నాలుగేళ్లుగా చంద్రబాబు పాలనను చూసిన తనకు అవినీతిపై పోరాడాలనిపించిందని అందుకే ఈ కేసు వేసానని ఆయన చెప్పారు. ఈ అవినీతి కేసు వల్ల న్యాయస్థాన పరంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్‌ లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకపోయిన తెలుగు ప్రజలలో మాత్రం చర్చ జరగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.