Begin typing your search above and press return to search.

విలీనం వీజీ కాదంటున్న న్యాయ నిపుణులు

By:  Tupaki Desk   |   13 Feb 2016 6:31 AM GMT
విలీనం వీజీ కాదంటున్న న్యాయ నిపుణులు
X
టీటీడీపీకి సంబంధించి విలీన వ్యవహారం ఇప్పుడు పలు ప్రశ్నల్ని రేకెత్తిస్తోంది. ఓపక్క తెలంగాణ అధికారపక్షంలో చేరిన టీటీడీపీ ఎమ్మెల్యేలు ‘పార్టీ’ని టీఆర్ ఎస్ లో విలీనం చేసినట్లుగా వాదనకు దిగితే.. అదెలా సాధ్యమంటూ టీటీడీపీలో మిగిలిన ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. టీటీడీపీఎల్పీ విలీనంపై జంపింగ్ ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేయటంతో అసలు ఇది సాధ్యమయ్యే అంశమేనా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

దీనిపై న్యాయనిపుణుల వాదన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. కొందరు న్యాయవాదులు చెబుతున్న మాటల్ని చూస్తే.. టీఆర్ ఎస్ లోకి జంప్ అయిన టీటీడీపీ ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా టీటీడీపీఎల్పీని టీఆర్ ఎస్ లోకి విలీనం చేస్తున్నట్లు చెప్పటం నిబంధనల ప్రకారం సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 91వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. చెల్లదని స్పష్టం చేస్తున్నారు.

ఏదైనా పార్టీ విలీనం కావాలంటే మొత్తంగా ప్రక్రియ పూర్తి అయిన తర్వాత.. అసెంబ్లీలో మూడింట రెండువంతుల మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేయాల్సి ఉందని.. అంతే తప్ప శాసనసభాపక్షంగా చెప్పుకునే కొందరు తీర్మానం చేస్తే అయిపోదని చెబుతున్నారు. రాజ్యాంగ సవరణ ప్రకారం మూడోవంతు.. మూడింట రెండు వంతుల ఎమ్మెల్యేలు వెళ్లిపోతే విలీనం అయినట్లు కాదంటున్నారు. విలీనం అంటే.. పార్టీ మొత్తం విలీనం అయితే తప్ప ఇది సాధ్యం కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. చూస్తుంటే.. ఎర్రబెల్లి అండ్ కో చెబుతున్నట్లు టీటీడీపీఎల్పీని టీఆర్ ఎస్ లోకి విలీనం చేస్తామని చెప్పినంతగా పని పూర్తి కాదన్నమాట.