Begin typing your search above and press return to search.

అంత బతుకు బతికిన గఢాఫీ చివర్లో మాత్రం..?

By:  Tupaki Desk   |   6 Feb 2016 6:38 AM GMT
అంత బతుకు బతికిన గఢాఫీ చివర్లో మాత్రం..?
X
నియంతగా వణికించిన అతికొద్ది మంది కర్కస దేశాధినేతల్లో గఢాఫి ఒకరు. బతికినన్నాళ్లు తన దుర్మార్గాలతో.. దారుణాలతో.. చేతిలో ఉన్న పవర్ ను ఇష్టారాజ్యంగా వాడేసిన గడాఫీ చివర్లో ఎంత దిక్కుమాలిన చావు చచ్చాడన్నది చూస్తే.. అయ్యో అనిపించక మానదు. కోట్లాది మంది బతుకులతో ఆడుకున్న ఈ నియంత.. తన ఆఖరి క్షణాల్లో తనకు ప్రాణభిక్ష పెట్టాలంటూ ఆర్థిస్తున్న తీరు చూస్తే.. విస్మయాన్ని కలిగిస్తుంది.

గఢాఫీ ఆఖరి క్షణాలకు చెందిన వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. రక్తమోడుతున్న శరీరం.. తలకు పాయింట్ చేసిన గన్ పెట్టిన సందర్భంలో అత్యంత దీనంగా ఆర్థిస్తున్న గడాఫీని లిబియా తిరుగుబాటుదారులు చంపేయటం తెలిసిందే. అయితే. గడాఫీని చంపింది రెబల్ ఫైటర్ అయ్ మాన్ అల్మానీగా చెబుతారు. అతడే గడాఫీని అంతమొందించాడన్న వాదన బలంగా వినిపిస్తుంటుంది. అయితే.. అది నిజం కాదని.. తాజా వీడియో స్పష్టం చేస్తుంది. నిజానికి అల్మానీ తన మీద వచ్చిన ప్రచారాన్ని బలంగా ఖండించేవాడు. అయితే.. ఆయన మాటల్ని నమ్మే వాళ్లు కాదు.

ఇక.. తాజాగా బయటకు వచ్చిన వీడియో ఫుటేజ్ చూస్తే.. తలకు.. ఒంటికి గాయాలై.. తీవ్ర రక్తస్రావంతో ఉన్న గడాఫీ తనను ప్రాణాలతో వదిలేయమని కోరటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంటుంది.ఆ తర్వాత తిరుగుబాటుదారులు అతని తలపై గన్ పెట్టేసి కాల్చి చంపినట్లుగా ఉంది. గడాఫీ పై తాను గన్ పేల్చలేదని.. కాకుంటే అతని ప్రాణాలు తీసిన బంగారు గన్ ను తనతో ఉంచుకున్నట్లుగా అల్మానీ చెబుతుంటాడు. లిబియన్ విప్లవానికి చిహ్నంగా సదరు గన్ మారిందన్నది అతగాడి వాదన. గడాఫీ ఉదంతాన్ని చూసినప్పుడు.. అప్పుడెప్పుడో రెండు దశాబ్దాల క్రితం మమ్ముట్టి హీరోగా నటించిన సామ్రాజ్యం సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. హింసను నమ్ముకున్న వాడు హింసతోనే అంతమవుతాడని.. గడాఫీ కూడా అందుకు మినహాయింపు కాదు.