Begin typing your search above and press return to search.

ఆ ఫ్లైట్ల‌లో వ‌చ్చే ల్యాపీల‌కు యూఎస్ నో

By:  Tupaki Desk   |   21 March 2017 8:52 AM GMT
ఆ ఫ్లైట్ల‌లో వ‌చ్చే ల్యాపీల‌కు యూఎస్ నో
X
కొన్ని దేశాల నుంచి విదేశీయుల‌పై ఆంక్ష‌లు విధించిన ట్రంప్ స‌ర్కారు.. తాజాగా అమెరికాకు వ‌చ్చే కొన్ని విమానాలు తీసుకొచ్చే ల్యాప్ టాప్‌లు.. టాబ్లెట్ల‌పై ఆంక్ష‌లు విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఎనిమిది దేశాల నుంచి వ‌చ్చే విమానాల్లో తీసుకొచ్చే ఈ ఎల‌క్ట్రానిక్ ఉప క‌ర‌ణాల్ని యూఎస్‌లోకి అనుమ‌తించ‌రు.

మంగ‌ళ‌వారం నుంచి అమ‌ల్లోకి వ‌చ్చే ఈ కొత్త నిబంధ‌న ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. భ‌ద్ర‌తా ప‌ర‌మైన చ‌ర్య‌ల్లో భాగంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. అయితే.. ఈ నిర్ణ‌యం తాత్కాలిక‌మేన‌ని.. కొన్ని వారాల‌పాటే ఆంక్ష‌లు ఉంటాయ‌ని చెబుతున్నారు. అయితే.. ఈ నిషేధం ఎందుకన్న అంశంపై మాత్రం అధికారులు వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

నిషేధం విధించిన దేశాలు చూస్తే.. ఈజిప్టు రాజధాని కైరో.. జోర్డాన్‌లోని అమన్‌.. కువైట్‌.. మొరాకోలోని కసబ్లాంకా.. ఖతార్ లోని దోహ.. సౌదీలోని రియాద్‌.. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌.. దుబాయి నుంచి వచ్చే నాన్‌స్టాప్‌ విమానాల్లో ల్యాప్ టాప్.. ట్యాబ్లెట్ల‌ను తీసుకొస్తే యూఎస్‌లోకి అనుమ‌తించ‌రు. ట్రంప్ స‌ర్కారు తీసుకున్న ఈ నిర్ణ‌యం గురించి జోర్డాన్‌కు చెందిన రాయ‌ల్ జోర్డానియ‌న్ ఎయిర్ లైన్స్ అధికారులు మొద‌ట ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.
అమెరికా అధికారుల సూచ‌న మేర‌కు.. త‌మ విమానాల్లో ప్ర‌యాణించే ప్ర‌యాణికుల ల్యాప్ టాప్‌.. ట్యాబ్లెట్ల‌ను అనుమ‌తించ‌మ‌ని పేర్కొన్నారు. భ‌ద్ర‌తా చ‌ర్య‌ల్లో భాగంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా పేర్కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/