Begin typing your search above and press return to search.

కేటీఆర్‌ కు ఫిదా అయిన మంచు ల‌క్ష్మీ

By:  Tupaki Desk   |   24 July 2016 1:04 PM GMT
కేటీఆర్‌ కు ఫిదా అయిన మంచు ల‌క్ష్మీ
X
తెలంగాణ ఐటీ మంత్రి కే తార‌క‌రామారావుకు ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. రాజ‌కీయాల్లో అంటే త‌న తండ్రి - తెలంగాణ సీఎం కేసీఆర్ కార‌ణంగా అభిమానులు ఉండ‌టం కామ‌న్‌. కానీ ఇపుడు సినీరంగం నుంచి కూడా అభిమానుల‌ను సంపాదించుకోవ‌డంలో కేటీఆర్ ముందుంటున్నారు. తాజాగా ఈ వ‌రుస‌లో ప్ర‌ముఖ సినీన‌టి మంచులక్ష్మి చేరిపోయారు. కేటీఆర్ తీసుకున్న నిర్ణ‌యం కారణంగా ఆమె ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఇంచార్జీ మంత్రిగా - పుర‌పాల‌క మంత్రిగా ఉన్న కేటీఆర్ న‌గ‌రంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న న‌గ‌రంలోని ఫ్లెక్సీలు - హోర్డింగ్‌ లు తొల‌గించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు అధికారుల‌కు హుకుం జారీచేశారు. అంతేకాదు త‌న బ‌ర్త్‌ డే సంద‌ర్భంగా అభిమానులు పెట్టే వాటిని కూడా నిర్దాక్షిణ్యంగా తొల‌గించాల‌ని ఆదేశించారు. ఈ నిర్ణ‌య‌మే మంచు ల‌క్ష్మీని మెస్మ‌రైజ్ చేసింది. ఇంత‌టి నిర్ణ‌యం తీసుకున్న కేటీఆర్ ప్ర‌శంస‌నీయుయ‌డు అంటూ ఆమె ట్వీట్ చేసింది.మీలాంటి మ‌రింత మంది నాయ‌కులు కావాలి అంటూ కితాబిచ్చింది.

ఇదిలాఉండ‌గా త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలుపాల‌నుకునే వారు ఫ్లెక్సీలు వేసి సొమ్ములు వృథా చేసే బ‌దులుగా... పేద‌ల‌కు దుస్తులు - పండ్లు పంపిణీ చేయాల‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు.