Begin typing your search above and press return to search.

ల‌గ‌డ‌పాటిని ఇలా కూడా మ‌నం చూడ‌వ‌చ్చు

By:  Tupaki Desk   |   18 Oct 2017 5:18 PM GMT
ల‌గ‌డ‌పాటిని ఇలా కూడా మ‌నం చూడ‌వ‌చ్చు
X
సీరియ‌స్ పొలిటీషియ‌న్‌ గా ఉండే కొంద‌రు నేత‌లు రాజ‌కీయాల‌ను వృత్తిప‌రంగా మాత్ర‌మే భావిస్తూ వ్య‌క్తిగ‌తంగా త‌మ జీవ‌న‌శైలిని ఆహ్లాద‌క‌రంగా - ఆనంద‌మయంగా ఉంచుకుంటారు. అయితే సీరియ‌స్ పొలిటీషియ‌న్‌ గా ఉండేవారికి ఇది అన్ని సంద‌ర్భాల్లో సాధ్యం కాక‌పోవ‌చ్చు...రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న‌పుడు సాధ్యం కావ‌చ్చు. సంద‌ర్భం ఏదైనా...రాజ‌కీయాల్లో ఉన్నా లేక‌పోయినా...వార్త‌ల్లో నిల‌వ‌డం కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స్టైల్‌.

రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించిన రాజ‌గోపాల్‌ అన్న‌ట్లుగానే రాజ‌కీయాల‌కు దూరంగానే ఉంటున్నారు. కానీ ఆయా ప‌రిణామాల‌ను ఫాలో అవుతున్నార‌నుకోండి. అయితే అలా పొలిటిక‌ల్‌గా బిజీలేని ల‌గ‌డ‌పాటి ఇప్పుడు అంటే ప్ర‌స్తుతం ఏం చేస్తున్నారో తెలుసా....హ్యాపీగా...జాలీగా ఫ్యామిలీతో గ‌డిపేస్తున్నారు. ఇదిగో ఇవే ఆ చిత్రాలు. ఈ ఫొటోల్లో త‌న కుటుంబంతో ల‌గ‌డ‌పాటి జాలీగా గడిపేస్తున్నారు. దుబాయ్ అలా ఫ‌న్ టైంలో ఉన్న ఫొటోలు ల‌గ‌డ‌పాటి స‌తీమ‌ణి జాన‌కి త‌న సోష‌ల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. దీంతో అయి వైర‌ల్ అయ్యాయి. జాలీగా గ‌డుపుతున్న టైంలో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌ను చూస్తుంటే...ఆయ‌న కుర్రాడిలా మారిపోయార‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఒక‌ప్పుడు సీరియ‌స్ పొలిటీషియ‌న్ అయిన రాజ‌గోపాల్ ఇంత సింపుల్‌గా కూడా త‌న టైంను ఫ్యామిలీతో గ‌డ‌పుతారా? అంటూ కొంద‌రు త‌మ భావాల‌ను షేర్ చేసుకుంటున్నారు.