లగడపాటి లెక్క...జనసేనకు పది శాతం ఓట్లు

Sun May 19 2019 18:56:11 GMT+0530 (IST)

ఆంధ్రా ఆక్టోపస్ గా పేరుగాంచిన బెజవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించారు తిరుమల వెంకన్న పాదాల చెంత తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన ఆర్జీ ఫ్లాష్ టీం ద్వారా చేయించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించారు. ఆది నుంచి చెబుతున్నట్లుగానే ఏపీలో టీడీపీ - తెలంగాణలో టీఆర్ ఎస్  ఈ దఫా మెజారిటీ సీట్లు సాదించబోతున్నాయని ఆయన జోస్యం చెప్పారు.లోక్ సభ సీట్ల కు సంబంధించి ఏపీలో మొత్తం 25 సీట్లు ఉంటే... వాటిలో అధికార టీడీపీ 15 నుంచి 17 సీట్లు (15కు రెండు ఎక్కువ గానీ - రెండు తక్కువ గానీ) సాధిస్తుందని చెప్పారు. అదే సమయంలో విపక్ష వైసీపీ 10 సీట్ల నుంచి 12 సీట్లు (10కి రెండు ఎక్కువ గానీ - రెండు తక్కువ గానీ) సాధిస్తుందని తెలిపారు. ఇక ఇతరుల కోటాలో ఓ సీటు వెళ్లే అవకాశాలున్నట్లు కూడా ఆయన జోస్యం చెప్పారు. మొత్తంగా మొదటి నుంచి తాను చెబుతూ వస్తున్నట్లుగానే టీడీపీనే మెజారిటీ లోక్ సభ సీట్లను సాధిస్తుందని ఆయన చెప్పేశారు.

ఇక తెలంగాణ విషయానికి వస్తే.. మొత్తం 17 సీట్లు ఉంటే... అధికార టీఆర్ ఎస్ 14 నుంచి 16 సీట్లు గెలుస్తుందని లగడపాటి చెప్పారు. మజ్లిస్ ఓ సీటులో విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లు సాధించే అవకాశాలున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ సింగిల్ సీటు కూడా సాధించే అవకాశమే లేదని కూడా లగడపాటి తేల్చేశారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలకే మెజారిటీ లోక్ సభ సీట్లు దక్కే అవకాశాలున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

జనసేనకు లగడపాటి సర్వే మిశ్రమ ఫీలింగును కలిగించింది. 10-12 శాతం ఓట్లు లగడపాటికి వచ్చాయి. కాకపోెతే సీట్లు మాత్రం ఒకటి లేదా రెండుకు మించి వస్తాయన్నారు. నిజంగా జనసేనకు పది శాతం ఓట్లు వస్తే ఆ పార్టీకి భవిష్యత్తు బాగానే ఉన్నట్టు అనుకోవాలి. కాకపోతే సీట్లు లేకుండా వచ్చే ఐదేళ్లు ఆ పార్టీని కాపాడుకోవడం అంత సులువైన విషయమైతే కాదు.