Begin typing your search above and press return to search.

ల‌గ‌డ‌పాటి అంత మాట అన్నాడంటే అర్థం ఏమిటి?

By:  Tupaki Desk   |   20 May 2019 4:57 AM GMT
ల‌గ‌డ‌పాటి అంత మాట అన్నాడంటే అర్థం ఏమిటి?
X
రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న విఫ‌ల ప్ర‌యాణాన్ని ప‌క్క‌న పెడితే.. ఎగ్జిట్ పోల్స్ ను చెప్పే విష‌యంలో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ కు ఉన్న పేరు కాస్త ఎక్కువే. అదెంత అంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప‌క్ష కూట‌మి గెలుస్తుంద‌న్న ల‌గ‌డ‌పాటి స‌ర్వే మాట‌కు.. అంత పెద్ద కేసీఆర్ సైతం ఒక్క‌సారి ఉలిక్కిప‌డ‌ట‌మే కాదు.. త‌న నిఘా వ్య‌వ‌స్థ‌ను ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని లెక్క‌లు త‌యారు చేయాల‌న్న ఆదేశాలు ఇచ్చేంత‌. అంతేనా.. త‌న గెలుపు లెక్క‌ల్ని మ‌రోసారి స‌రి చూసుకునేందుకు ఫామ్ హౌస్ వెళ్లిపోయేంత‌.

త‌న‌కు స‌ర్వే రిపోర్టులు సిద్ధం చేసిన సంస్థ‌ల్ని.. మ‌రిన్ని శాంపిల్స్ తీసుకొని లెక్క‌లు తేల్చాల‌ని పుర‌మాయించినంత‌. అలాంటి ల‌గ‌డ‌పాటి లెక్క‌లు ఎంత‌గా చిత్తు అయ్యాయ‌న్న విష‌యం తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు నిరూపించిన వైనాన్ని మ‌ర్చిపోలేం. తెలంగాణ ఎన్నిక‌లకు సంబంధించి ల‌గ‌డ‌పాటి చెప్పిన స‌ర్వే అబ‌ద్దం కావ‌ట‌మే కాదు.. ఆయ‌న‌పై ఉన్న న‌మ్మ‌కం మొత్తం పోయేలా చేసింది.

అలాంటి ల‌గ‌డ‌పాటి తాజాగా త‌న ఎగ్జిట్ పోల్స్ ను పేర్కొంటూ ఏపీలో చంద్ర‌బాబు గెలుపు ఖాయ‌మ‌ని.. జ‌గ‌న్ ఓట‌మి త‌థ్య‌మ‌న్న మాట‌ను బ‌లంగా చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో కేంద్రంలో హంగ్ వ‌స్తుంద‌న్న మాట‌ను చెప్పారు. ఎవ‌రిని త‌న మాట‌ల్ని న‌మ్మ‌మ‌ని చెప్ప‌న‌ని.. తానేమీ గొంతు మీద క‌త్తి పెట్టి.. త‌న ఫ‌లితాల్ని న‌మ్మాల‌ని చెప్ప‌నంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

తాను చెప్పిన అంచ‌నాలు ఎంత‌గా నిజ‌మ‌వుతాయ‌న్న‌ది 23 త‌ర్వాత తెలుస్తుంద‌న్న ల‌గ‌డ‌పాటి.. ఓట్ల లెక్కింపు త‌ర్వాత త‌న విశ్వ‌స‌నీయ‌త మ‌రింత పెరుగుతుంద‌న్న ధీమాను వ్య‌క్తం చేశారు. ఈసారి త‌న స‌ర్వే అంచ‌నాలు త‌ప్పితే.. మ‌ళ్లీ స‌ర్వే చేయ‌నంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌ను ఆయ‌న చేయ‌టం గ‌మ‌నార్హం.

ఈసారి ఎన్నిక‌ల ఫ‌లితాల్లో తాను చెప్పిన‌ట్లుగా జ‌ర‌గ‌కుంటే.. రానున్న రోజుల్లో స‌ర్వేల జోలికి వెళ్ల‌న‌న్న శ‌ప‌ధం చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ల‌గ‌డ‌పాటి శ‌పధం వ‌ర‌కూ వెళ్లేంతలా బాబు గెలుపు మీద ఆయ‌న‌కున్న కాన్ఫిడెన్స్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రి.. ఆయ‌న తాజా శ‌ప‌ధం ప్ర‌భావం ఓట్ల లెక్కింపు షురూ అయ్యే వ‌ర‌కూ అంద‌రి నోట నాన‌టం మాత్రం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.