Begin typing your search above and press return to search.

లగడపాటి పాట.... టీడీపీకి వంద !!

By:  Tupaki Desk   |   19 May 2019 12:40 PM GMT
లగడపాటి పాట.... టీడీపీకి వంద !!
X
తెలుగు వాళ్లు ఆసక్తిగా ఎదురుచూసే లగడపాటి సర్వే ఫలితాలు వచ్చేశాయి. సాధారణంగా ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించే లగడపాటి ఈసారి పోస్ట్ పోల్ సర్వే నిర్వహించారు. ఆర్జీ ఫ్లాష్ టీం ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వే ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 21 మధ్య జరిగింది. రాండమ్ గా ఎంపిక చేసిన 38 అసెంబ్లీ స్థానాలలో ఈ సర్వే నిర్వహించారని వారు ప్రకటించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1200 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించి ఈ సర్వే నిర్వహించారు. ఇందులో అన్ని వర్గాలు, అన్ని వయసుల వారి అభిప్రాయాలు క్రోడీకరించినట్లు చెప్పారు. ఏపీ మొత్తం మీద 50 వేల అభిప్రాయాలను సేకరించారు. దీన్ని లగడపాటి అంచనాలు ఇలా ఉన్నాయి.

అసెంబ్లీ సీట్లు

టీడీపీ - 100 (10 అటు ఇటు)
వైసీపీ - 72 (7 అటు ఇటు)
ఇతరులు - 3 (2 అటు ఇటు)

అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం
టీడీపీ 43-45 శాతం
వైసీపీ 40-42 శాతం
జనసేన 10- 12 శాతం

పార్లమెంటు సీట్లు
టీడీపీ - 15 (హెచ్చుతగ్గులు 2)
వైసీపీ - 10 (హెచ్చు తగ్గులు 1)
ఇతరులు - 0-1

పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం
టీడీపీ: 43-45 శాతం
వైసీపీ: 40.5 నుంచి 42.5 శాతం
జనసేన: 10-12 శాతం

సర్వేలో కీ పాయింట్స్

* మహిళా ఓటర్లలో టీడీపీ బలంగా ఉంది. పురుష ఓటర్లలో వైసీపీ బలంగా ఉంది

* యూత్ లో జనసేన బలంగా ఉంది.

* ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేకపోగా కొంచె సానుకూలత ఉంది. అయితే, కొందరు ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంది

* పబ్లిక్ టాక్ వైసీపీకి బలంగా ఉన్నా... సైలెంట్ ఓటరు మద్దతు టీడీపీకి అనుకూలంగా ఉంది.