Begin typing your search above and press return to search.

జమ్మూ పీటముడి.. గెలిచిన బీజేపీ ఏం చేస్తుంది?

By:  Tupaki Desk   |   26 May 2019 11:10 AM GMT
జమ్మూ పీటముడి.. గెలిచిన బీజేపీ ఏం చేస్తుంది?
X
భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని ప్రత్యేక అధికారాలు, హోదాలు జమ్మూ అండ్ కాశ్మీర్ కు ఉన్నాయి. ఆర్టికల్ 370 -35 ఏ అంటూ ప్రత్యేక అధికారాలు కల్పించారు. కానీ బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే కాశ్మీర్ కు ఉన్న అధికారాలను తీసేస్తామని.. ఆ రాష్ట్ర ప్రజలు కోరుకున్న స్వేచ్ఛను ఇస్తామని ప్రత్యేక హక్కుల ఆర్టికల్స్ ను తొలగిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అన్నట్టే జమ్మూ, లడక్ ప్రాంతాల్లో బీజేపీ అధిక సీట్లను సాధించింది.

జమ్మూ అండ్ కాశ్మీర్ లోని మొత్తం ఆరు స్థానాలకు గాను మూడు స్థానాలను నేషనల్ కాన్ఫరెస్స్ గెలిచింది ఈ వివాదంపై ఎన్సీ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా స్పందించారు. రాజ్యాంగంలో జమ్మూ కాశ్మీర్ కోసం ప్రతిపాదించిన ఆర్టికల్ 370, 35-ఏలను తొలగించడం ప్రధాని నరేంద్రమోడీకి సాధ్యం కాదని తేల్చిచెప్పారు. రెండు ఆర్టికల్స్ రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడుతున్నాయని అన్నారు.

బీజేపీ హామీని నమ్మి జమ్మూలో 3 లోక్ సభ సీట్లను జమ్మూ కాశ్మీర్ ప్రజలు గెలిపించారని.. దీన్ని బట్టి ఆ రెండు ఆర్టికల్స్ ను తొలగించాలనే తీర్పును ఇచ్చారని బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో 3 బీజేపీ, 3 నేషనల్ కాన్ఫరెన్స్ కు ఇచ్చారని.. అందుకే సగం మంది వ్యతిరేకించిన ఆర్టికల్స్ ను బీజేపీ ఎలా రద్దు చేస్తుందని మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ ప్రశ్నిస్తోంది..

జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ 46.4శాతం ఓటు బ్యాంకును సాధించింది. జమ్ము, ఉద్దంపూర్, లడక్ ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో విఫలమైంది. కేవలం 28.5శాతం మాత్రమే సాధించి ఎంపీ సీట్లను గెలుపొందలేదు.

ఇలా బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్ చెరో మూడు సీట్లను కైవసం చేసుకోవడంతో రాష్ట్రంలోని ఆర్టికల్స్ ను తొలగించడంలో పీటముడి నెలకొంది. తొలగిస్తామని బీజేపీ, వద్దని ఎన్సీ డిమాండ్ చేస్తుండడంతో ఎవరి ఆధిపత్యం నడుస్తుందోనన్న ఉత్కంఠ జమ్మూ ప్రజల్లో నెలకొంది.