Begin typing your search above and press return to search.

బాత్రూం పాప ట్వీట్ తో 7వేల‌కోట్ల న‌ష్టం

By:  Tupaki Desk   |   23 Feb 2018 9:46 AM GMT
బాత్రూం పాప ట్వీట్ తో 7వేల‌కోట్ల న‌ష్టం
X
బాత్రూం పాప కైలీ జెన్న‌ర్ పోస్ట్ చేసిన ఒక్క‌ట్వీట్ తో స్నాప్ చాట్ రూ.7వేల కోట్లు న‌ష్ట‌పోయింది. దీంతో ఏం చేయాలో పాలుపోక స్నాప్ చాట్ ల‌బోదిబోమంటుంది. కైలీ జెన్న‌ర్ అప్ప‌డప్పుడు ఇలా విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. గ‌తంలో ఓ షోలో బాత్రూంలో సెల్ఫీతీసి నెట్టింట్లో పోస్ట్ చేసింది. అయితే ఆ పోస్ట్ తో ఈమెకు బోలెడంత క్రేజ్ వ‌చ్చింది.

గ‌తఏడాది అమెరికా న్యూజెర్సీలో 68మెట్ గాలా ఫ్యాష‌న్ షో జ‌రిగింది. ఆ షోకి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ సెలబ్రిటీలు హాజ‌ర‌య్యారు. అయితే వారిలో 20మంది బాత్రూంలో ఉండ‌గా కైలీ త‌న కెమెరాకు ప‌నిచెప్పి సెల్ఫీ దిగింది. వెంట‌నే ఆ సెల్ఫీని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో కైలీ పోస్ట్ కు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన నెటిజ‌న్లు 20ల‌క్ష‌మంది లైక్ చేయ‌గా, 5.15ల‌క్ష‌ల‌మంది ఫోటోపై కామెంట్ చేశారు. అలా బాత్రూం సెల్ఫీతో పాపులారిటీ సంపాదించుకుంది.

అప్ప‌టినుంచి కైలీని ముద్దుగా బాత్రూం పాప అంటూ ఆమె అభిమానులు పిల‌వ‌డం మొద‌లు పెట్టారు. దీంతో 19ఏళ్ల కైలీకి 24.5మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ చేరిపోయారు. ఈ పాపులారిటీని క్యాష్ చేసుకునేందుకు ఆయా సోష‌ల్ మీడియా కంపెనీలు ఆమెతో ట్వీట్ ల‌ను పోస్ట్ చేయిస్తుంటాయి. పోస్ట్ కి కొన్ని కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుద‌రుచ్చుకున్నాయి. ఈ నేప‌థ్యంలో కైలీ స్నాప్ చాట్ కి వ్య‌తిరేకంగా ట్వీట్ చేసింది.

గ‌తకొద్దికాలంగా ఇన్ స్ట్రాగ్రామ్ తో పోటీ ప‌డేలా స్నాప్ చాట్ ను మార్పులు చేయాల‌ని నెటిజ‌న్లు సంత‌కాల సేక‌ర‌ణ చేప‌ట్టారు. అయినా స‌ద‌రు సంస్థ మార్పులు చేయ‌లేదు. దీనిపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ కైలీ స్నాప్‌ ఛాట్‌ ఇక మీదట ఎవరైనా తెరవకూడదనుకుంటున్నారా? అది నేనే అనుకుంటున్నారా? ఇది చాలా బాధకరం అంటూ 19 ఏళ్ల కైలీ ఓ ట్వీట్‌ చేసింది. అంతే ఆ ఒక్క ట్వీట్ తో స్నాప్ చాట్ షేర్లు 1.3 బిలియన్‌ డాలర్లు (సుమారు 7వేల కోట్లకు పైగా) కుప్ప కూలిపోయాయి.

ఈ విష‌యం తెలుసుకున్న కైలీ త‌క్ష‌ణ‌మే ట్వీట్ పై స్పందిస్తూ నువ్వే నా తొలిప్రేమ.. నువ్వంటే నాకిష్టం అంటూ స్నాప్‌ ఛాట్ ప్రేమ‌ను ఒల‌క‌బోసింది. కానీ లాభంలేదు. అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయి. స్నాప్ చాట్ ప్రారంభించిన కొత్త‌ల్లో దాని షేర్ విలువ ఎంత ఉందో ఇప్పుడు అంత‌కి ప‌డిపోయింది.