Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ అన్యాయం చేయ‌లేదు.. మేమే అన్యాయం చేశాం

By:  Tupaki Desk   |   21 March 2019 11:35 AM GMT
జ‌గ‌న్ అన్యాయం చేయ‌లేదు.. మేమే అన్యాయం చేశాం
X
కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ ఏపీ అధికార‌ప‌క్షానికి వ‌రుసగా ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్న విష‌యం తెలిసిందే. పార్టీలో చేరే ముందు ఇచ్చే హామీల‌కు.. త‌ర్వాత తీసుకునే నిర్ణ‌యాల‌కు సంబంధం లేన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరుపై క‌ర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం సాధించిన ఆయ‌న‌.. త‌ర్వాతి కాలంలో సొంత పార్టీకి ద్రోహం చేస్తూ.. జ‌గ‌న్ కు హ్యాండిస్తూ టీడీపీలోకి చేర‌టం తెలిసిందే.

ఎస్వీ మోహ‌న్ రెడ్డికి పార్టీ టికెట్ క‌న్ఫ‌మ్మ్ అని లోకేశ్ ప్ర‌క‌టించినా.. ఇటీవ‌ల కాలంలో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో క‌ర్నూలు అసెంబ్లీ టీడీపీ అభ్య‌ర్థిగా టీజీ వెంక‌టేశ్ కొడుకు టీజీ భ‌ర‌త్ కు టికెట్ ఇవ్వ‌టం తెలిసిందే. దీనిపై ఎస్వీ మోహ‌న్ రెడ్డి తాజాగా బ‌రస్ట్ అయ్యారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఆయ‌న‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాల‌న్న త‌న కార్య‌క‌ర్త‌ల మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటాన‌ని ప్ర‌క‌టించారు.

వైఎస్ జ‌గ‌న్ త‌మ‌కు ఎలాంటి అన్యాయం చేయ‌లేద‌ని.. తామే పార్టీ మారి వైఎస్ జ‌గ‌న్ కు అన్యాయం చేసిన‌ట్లుగా ఎస్వీ వ్యాఖ్యానించారు. త‌ప్పు తెలుసుకున్నామ‌ని.. చంద్ర‌బాబు మోసాన్ని టీడీపీ విధివిధానాల్ని ఎండ‌గ‌డ‌తామ‌ని చెప్పారు.

క‌ర్నూలు అసెంబ్లీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి హ‌ఫీజ్ ఖాన్ ను గెలిపించుకొని.. ఏపీ సీఎంగా జ‌గ‌న్ ను చేసుకోవ‌ట‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని ఎస్వీ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. క‌ర్నూలులో త‌మ స‌త్తా ఏమిటో చూపిస్తామ‌న్నారు. త‌న పోరాటం.. స‌వాల్ కోట్ల‌.. కేఈ.. టీజీ కుటుంబాల‌కు వ్య‌తిరేకంగా పోరాడ‌తాన‌ని చెప్పారు. వాళ్లు ఎంత‌మంది ఉన్నా తాను భ‌య‌ప‌డ‌న‌ని.. కేసుల‌పై వెన‌క్కి త‌గ్గేది లేద‌న్నారు. రానున్న ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల్ని గెలిపించుకొని వైఎస్ జ‌గ‌న్ కు బ‌హుమ‌తిగా ఇస్తామ‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోస‌మే పార్టీ మారానే త‌ప్పించి.. డ‌బ్బుల కోసం కాద‌న్న ఆయ‌న‌.. చంద్ర‌బాబు యూజ్ అండ్ త్రో విధానం త‌న‌కు అర్థ‌మైంద‌న్నారు.