Begin typing your search above and press return to search.

ఆ ఫ్యామిలీకి త‌గిలిన‌న్నిషాకులు అన్నిఇన్నికావ‌ట‌

By:  Tupaki Desk   |   25 May 2019 5:40 AM GMT
ఆ ఫ్యామిలీకి త‌గిలిన‌న్నిషాకులు అన్నిఇన్నికావ‌ట‌
X
తాజాగా వెలువ‌డిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు క‌ర్ణాట‌క‌లోని ఒక ప్ర‌ముఖ రాజ‌కీయ ఫ్యామిలీకి షాకుల మీద షాకులుగా మారాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌గిలిన హోల్ సేల్ షాకుల‌కు క‌ర్ణాట‌క అధికార ప‌క్ష అధినేత కుటుంబం అస్స‌లు త‌ట్టుకోలేక‌పోతోందట‌. ప్ర‌తి విష‌యంలోనూ త‌గులుతున్న షాకుల‌తో త‌ల్ల‌డిల్లిపోతోన్నది ఎవ‌రో ఇప్ప‌టికే అర్థ‌మైపోయిందిగా. అవును.. క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి కుటుంబానికి భారీ షాకులు మ‌రేరాజ‌కీయ పార్టీలోని కీల‌క నేత కుటుంబానికి త‌గ‌ల్లేదంటున్నారు.

లోక్ స‌భ‌లో క‌ర్ణాట‌కకు మొత్తం 28 సీట్లు ఉండ‌గా.. 25 సీట్ల‌లో బీజేపీ గెలుచుకుంది. ఇదో షాకైతే.. జ‌న‌తాద‌ళ్ పార్టీ అధినేత క‌మ్ మాజీ ప్ర‌ధాని హెచ్ డీ దేవెగౌడ స్వ‌యంగా బ‌రిలో దిగిన తుముకూరు నియోజ‌క‌వ‌ర్గంలో 13 వేల ఓట్ల తేడాతో ఓడిపోవ‌టం ఒక ఎత్తు మ‌రో షాక్ గా మారింది. బెంగ‌ళూరు రూర‌ల్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్య‌ర్థి డీకే సురేశ్ రెండు ల‌క్ష‌ల‌కు పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెల‌వ‌టం మ‌రో షాక్ గా మారింది. దేవెగౌడ తాను బ‌రిలో దిగే హాస‌న్ ను త‌న మ‌న‌మ‌డికి ఇచ్చేసి తాను తుముకూరులో నిలిచారు. తాత ప్రాతినిధ్యం వ‌హించిన నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసిన ప్ర‌జ్వ‌ల్ రేవ‌న్న ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌టం షాక్ కాకున్నా.. తాత ఓడిపోయి త‌ను మాత్రం గెల‌వ‌టాన్ని మ‌న‌మ‌డు జీర్ణించుకోలేక‌పోతున్నారు. దీంతో.. త‌న ప‌ద‌వికి రాజీనామా చేసేసి.. మ‌ళ్లీ వ‌చ్చే ఉప ఎన్నిక‌ల్లో తాత‌ను బ‌రిలోకి దింపి గెలిపించుకుంటాన‌ని అత‌గాడు చెబుతున్న మాట‌లు వినేందుకు బాగానే ఉన్నా.. ప్రాక్టిక‌ల్ గా సాధ్యం కాద‌న్నది నిజం.

ఇలా తాత‌ను ఓడించార‌ని త‌న సీటు త్యాగం ఓట‌ర్ల‌కు ఒళ్లు మండితే కొండ నాలిక్కి ఎర వేస్తే ఉన్న నాలిక పోయిన చందంగా మారుతుంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ఆయ‌న ఎక్క‌డ గెలిచిన స్థానాన్ని వ‌దులుకుంటారోన‌న్న భ‌య‌ప‌డిపోతున్నారు పార్టీ వ‌ర్గాలు. వారి భ‌యానికి కార‌ణం లేక‌పోలేదు. ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైనంత‌నే.. ఆ మేర‌కు బీజేపీ బ‌ల‌ప‌డితే.. త‌మ చేతికున్న అధికారాన్ని చేజేతులారా చేజార్చుకున్న‌ట్లేన‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. దౌవెగౌడ మ‌రో మ‌న‌మ‌డు నిఖిల్ మాండ్య నుంచి బ‌రిలోకి దిగి ఓట‌మిపాలు కావ‌టం షాకే. సుమ‌ల‌త విజ‌యాన్ని ముందు నుంచి ఊహించిందే అయిన‌ప్ప‌టికీ.. సీఎం కుమార‌స్వామి ఈస్థానంలో గెలుపు కోసం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డారు.కానీ.. ఓట‌ర్ల సెంటిమెంట్ ముందు కుమార‌స్వామి ఎత్తులు ఫ‌లించ‌లేదు. తాజాగా వెలువ‌డిన ఫ‌లితాలు ఇచ్చిన షాకులు ఒక ఎత్తు అయితే.. ఎన్నిక‌ల్లో అధికార‌ప‌క్షం ఇంత దారుణంగా ఓడిన నేప‌థ్యంలో ప‌లువురు ఎమ్మెల్యేలు కానీ బీజేపీ గూటికి చేరితే ప్ర‌భుత్వానికే షాక్ త‌గులుతుంద‌ని చెబుతున్నారు. మ‌రేం జ‌రుగుతుందో చూడాలి.