Begin typing your search above and press return to search.

ట్రంప్ రసికత్వాన్ని చెప్పిన హాలీవుడ్ భామ

By:  Tupaki Desk   |   22 Jan 2017 4:16 AM GMT
ట్రంప్ రసికత్వాన్ని చెప్పిన హాలీవుడ్ భామ
X
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు సంబంధించిన ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. అందమైన ఆడపిల్ల కనిపిస్తే చాలు..విపరీతంగా మనసు పడే ఆయనలోని రసికత్వం ప్రపంచానికి సుపరిచితమే. అయితే.. ఆయనలోని ఈ కోణం ఎంత ఎక్కువన్న విషయాన్ని తాజాగా ఒక హాలీవుడ్ నటి బయటపెట్టారు. తానంటే ట్రంప్ ఎంతగా పడి చచ్చేవారో అన్న విషయాన్ని తెలియజేసే ట్రంప్ ట్వీట్లను ఆమె బయటపెట్టారు.

నేటి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్.. తనను ఎంతగా ఇష్టపడే వారన్న విషయాన్ని 26 ఏళ్ల క్రిస్టెన్ స్టెవార్ట్ చెబుతూ.. 2008లో ఆమె రాబర్ట్ ప్యాటిన్ సన్ తో సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య 2012లో మనస్పర్థలు వచ్చాయి. ఈ సందర్భంగా ట్రంప్ ఆమెను కెలుకుతూ.. ప్యాటిసన్ ఇప్పటికైనా తెలివిగా వ్యవహరించాలని.. ఆమెకు పడిపోకూడదని ట్రంప్ సూచించిన విషయాన్ని బయటపెట్టారు. తాను అప్పట్లో చిన్న నటినని.. కానీ.. ట్రంప్ కు తానంటే చాలా ఇష్టమని.. తన కోసం ఆయన పడిచచ్చే వారని ఆమె పేర్కొనటం గమనార్హం. రానున్న రోజుల్లో మరెన్ని ట్రంప్ రసిక కథలు బయటకు వస్తాయో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/