Begin typing your search above and press return to search.

కుర్రాడు రాజకీయాల్లోకి వచ్చినట్టేనా?

By:  Tupaki Desk   |   28 July 2015 9:40 AM GMT
కుర్రాడు రాజకీయాల్లోకి వచ్చినట్టేనా?
X
పెద్ద రెబల్‌ కృష్ణంరాజు, బుల్లి రెబల్‌ ప్రభాస్‌ ఇరువురూ ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోడీ తో మంతనాలు సాగించడం వెనక అంతరార్థం ఏమిటి? కేవలం బాహుబలి సినిమా చూడమని ఆహ్వానించడానికే వెళ్లారా? లేక భవిష్యత్‌ రాజకీయ పరిణామాల్ని దృష్టిలో పెట్టుకునే ప్రభాస్‌ని తీసుకెళ్లి మోడీకి పెదనాన్న పరిచయం చేశారనుకోవాలా? ఆలోచిస్తే ఇందులో చాలా లాజిక్‌ ఉంది. బాహుబలి ప్రపంచవ్యాప్తంగా బాహుబలి మానియా కొనసాగుతున్న ఈ వేళ అయితే ఈ పరిచయం బ్రిలియంట్‌ గా వర్కవుటవుతుందని కృష్ణంరాజు భావించినట్టున్నారు. భవిష్యత్‌ లో ఏపీ రాజకీయాల్లో ఓ ఆశాకిరణం మీకు బీజేపీ కి అండగా ఉంటాడన్న సిగ్నల్‌ ప్రధానికి ఇచ్చారని అనుకోవాలి.

ప్రస్తుతం బాహుబలి విజయంతో ప్రభాస్‌ రేంజ్‌ ఢిల్లీ లెవల్‌కి ఎదిగేసింది. ఎవరీ హీరో అన్న చర్చ వచ్చింది కాబట్టి ఇక అతడు వెల్‌నోన్‌ ఫేస్‌. అయితే పెదనాన్న కృష్ణంరాజు బీజేపీలో మరీ అంత యాక్టివ్‌గా లేరు కాబట్టి అది ప్రభాస్‌ కి ఎంతవరకూ ప్లస్సు? కాస్త ఆలోచించాల్సిందే. అయితే ప్రభాస్‌ సినీకెరీర్‌ మరో దశాబ్ధం తిరుగులేకుండా కొనసాగినా ఆ తర్వాత అయినా పొలిటికల్‌ ఎంట్రీ చేయాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఇప్పుడున్న క్రేజు ను ఒడిసిపట్టుకుని ఇప్పట్నుంచే రూట్స్‌ ని నిర్మించుకుంటే మంచిదనే సద్భావనతోనే రెబల్‌స్టార్‌ ఇలా ప్లాన్‌ చేశారన్నమాట. డ్యామ్‌ ష్యూర్‌ .. అదే నిజం.