Begin typing your search above and press return to search.

తెలంగాణలో తొలి మహిళా మంత్రి కోవా లక్ష్మి?

By:  Tupaki Desk   |   5 Oct 2015 10:57 AM GMT
తెలంగాణలో తొలి మహిళా మంత్రి కోవా లక్ష్మి?
X
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఖాయమని ఇప్పటికే తేలిపోయింది.. అందుకు ముహూర్తం కూడా దాదాపుగా ఖరారైనట్లు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్న 9వ తేదీనే కేబినెట్ లో మార్పులుండొచ్చు. అ రోజు సాయంత్ర 5.30కే కేసీఆర్ మార్పులపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే అయితే దాదాపుగా అంతా అందుబాటులో ఉంటారన్న ఉద్దేశంతో కేసీఆర్ అదేరోజు సాయంత్రం ఈ పని పెట్టుకున్నట్లు చెబుతున్నారు. అయితే... విస్తరణతో తెలంగాణలో తొలిసారి ఓ మహిళకు మంత్రి పదవి దక్కనుంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కోవా లక్ష్మిని కేబినెట్లో తీసుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కాగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ను, ఆజ్మీరా చందూలాల్ ను మంత్రివర్గం నుంచి తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. తలసాని విషయంలో జరుగుతున్న రగడకు స్వస్తి పలికేందుకు ఆయన్ను తప్పిస్తుండగా.... చందూలాల్ కు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన కోరిక మేరకే ఆయన్ను తప్పిస్తున్నారు. నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తలసానిని తప్పిస్తుండడంతో నగరం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న నాయిని నర్సింహారెడ్డి పదవకి ఢోకా ఉండకపోవచ్చు. దీంతో పోచారం శ్రీనివాసరెడ్డికి పదవీ గండం కనిపిస్తోంది.

కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని తొలుత ప్రచారం జరిగినా ఆయనకు అవకాశం రాకపోవచ్చు... వినయభాస్కర్ పట్ల కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా తలసానిని తొలగిస్తే ఆ మంత్రిత్వ శాఖ తుమ్మల నాగేశ్వరరావుకు ఇచ్చి... రహదారులుభవనాల శాఖను పల్లా రాజేశ్వరరెడ్డికి ఇస్తారని గట్టి సమాచారం.