Begin typing your search above and press return to search.

కేటీఆర్ ఆప‌రేష‌న్ స్టార్ట్: టీఆర్ ఎస్ గూటికి ఇండిపెండెంట్‌

By:  Tupaki Desk   |   12 Dec 2018 7:27 AM GMT
కేటీఆర్ ఆప‌రేష‌న్ స్టార్ట్: టీఆర్ ఎస్ గూటికి ఇండిపెండెంట్‌
X
తెలంగాణ ఎన్నిక‌ల్లో విజ‌య‌దుందుబి మోగించిన టీఆర్ ఎస్ పార్టీ త‌న ప్ర‌త్య‌ర్థుల‌ను ఈ పోరులో తుత్తునియ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. మ్యాజిక్ ఫిగ‌ర్‌ కు మించిన‌ మెజార్టీతో విజ‌యం సాధించిన టీఆర్ ఎస్ పార్టీ త‌న బ‌లోపేతానికి క‌లిసివ‌చ్చే అన్ని అవ‌కాశాలను ఉప‌యోగించుకొంటుంది. తాజాగా టీఆర్ ఎస్ పార్టీ యువ‌నేత‌ - మంత్రి కేటీఆర్ ఈ మేర‌కు ఆప‌రేష‌న్ స్టార్ట్ చేశారు. ఇండిపెండెంట్‌ గా గెలిచిన రామగుండం ఎమ్మెల్యే కొరుకంటి చందర్‌ ను గులాబీ గూటికి చేర్చ‌డంలో స‌ఫ‌లం అయ్యారు.

రామగుండం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన కోరుగంటి చందర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ ను కలిశారు. టీఆర్ ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు చందర్ ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ కి తెలియజేశారు. ఎన్నికల ముందు వరకు టీఆర్ ఎస్ పార్టీలోనే ఉన్నానని - ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో పని చేశానని ఆయ‌న పేర్కొన్నారు టీఆర్ ఎస్ పార్టీ తన మాతృసంస్థ అని ఈ సందర్భంగా చందర్ అన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో పని చేస్తానని ఈ సందర్భంగా చందర్ తెలిపారు. కాగా, తాజా చేరిక‌తో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య మ‌రొక‌టి పెరిగిన‌ట్ల‌యింది.