Begin typing your search above and press return to search.

మాయావతితో పొత్తు పెట్టుకోవడం 100% తప్పు: కోన

By:  Tupaki Desk   |   22 May 2019 11:56 AM GMT
మాయావతితో పొత్తు పెట్టుకోవడం 100% తప్పు: కోన
X
పాపులర్ టాలీవుడ్ రచయిత కోన వెంకట్ ఎలెక్షన్ క్యాంపెయిన్ జరుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం.. అవి వివాదాస్పదం కావడం తెలిసిందే. పవన్ కు సన్నిహితుడిగా మెలిగిన కోన వెంకట్ ఇలా పవన్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేయడం ఫ్యాన్స్ కు ఏమాత్రం మింగుడుపడలేదు. దీంతో కోనపై విమర్శలవర్షం కురిపించారు. దీంతో అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో కోన వివరణ ఇచ్చారు కానీ ఇంకా ఫ్యాన్స్ కోపం అయితే చల్లారలేదు.

ఎలెక్షన్స్ లో కోన వైసిపీకి మద్దతు పలికిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా కోన వెంకట్ ఒక వెబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడారు. పవన్.. జనసేన టాపిక్ కూడా వచ్చింది. ఆ టాపిక్ లపై మాట్లాడుతూ కొన్ని వ్యాఖలు చేశారు. "మీరు పవన్ కు సన్నిహితులు.. మీ సినిమా ఈవెంట్లకు పవన్ గారు హాజరయ్యారు. ఆలాంటప్పుడు మీరెందుకు పవన్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు?" అని అడిగితే "ఫ్రెండ్ షిప్ వేరు.. వారికుండే పర్సనల్.. పొలిటికల్ ఒపీనియన్స్ వేరు అయి ఉండొచ్చు. నా ఆహారపు అలవాట్లు.. నా రాజకీయ అభిప్రాయాలు..నా వ్యక్తిగత ఆలోచనలు మార్చుకోవాల్సిన అవసరం లేదు" అన్నారు.

ఇక జనసేన పార్టీ గురించి ప్రస్తావిస్తే పవన్ రెండు పొరపాట్లు చేశారని అభిప్రాయపడ్డాడు కోన. "ఒకటి పవన్ కళ్యాణ్ మాయావతి గారితో పొత్తు పెట్టుకోవడం. బీఎస్పీ కి ఆంధ్రప్రదేశ్ లో ఏమాత్రం బలం లేదు" అన్నారు. "మాయావతి తో పొత్తు పెట్టుకోవడం మీరు తప్పుగా చూస్తున్నారా?" అని ప్రశ్నిస్తే.."100% తప్పు. అవినీతి ఆరోపణలు ఉంటేనే మీరు తప్పుగా చూస్తున్నప్పుడు అవినీతి ఆరోపణలు నిరూపించబడి.. సుప్రీమ్ కోర్టు శిక్ష పడిన మాయావతి మీకు మదర్ థెరీసా లాగా కనిపించిందా?" అన్నారు. ఇక రెండో విషయం గురించి మాట్లాడుతూ "హైదరాబాద్ లో ఆంధ్ర సెట్లర్లపై దాడులు జరుగుతున్నాయి అని పవన్ గారు విమర్శలు చేయడం కూడా సరి కాదు." అని చెప్పారు.

అయితే అంతా విమర్శలు మాత్రమే కాదు.. పవన్ గురించి.. జనసేన గురించి చెప్తూ "డబ్బు ప్రభావం.. మందు ప్రభావం లేకుండా.. జీరో బడ్జెట్ పాలిటిక్స్ ను తీసుకొచ్చే విప్లవం అది. సక్సెస్ అవుతుందో లేదో తెలియదు కానీ అలాంటి రాజకీయానికి శ్రీకారం చుట్టినవారిలో పవన్ మొదటివాడు అవుతారు. నేను ఆ విషయంలో నా ఫ్రెండ్ ను చూసి గర్విస్తున్నాను" అన్నారు.

కోన అయితే తన స్టైల్లో కామెంట్లు చేశారు. ఇక ఈ కామెంట్లపై పవన్ ఫ్యాన్స్.. మద్దతుదారులు ఎలా స్పందిస్తారోవేచి చూడాలి.