ఓడిపోయాక కోమటిరెడ్డి చేసిన పని ఇదే..

Wed Dec 12 2018 11:10:55 GMT+0530 (IST)

ఓటమి ఎరుగని నేతగా.. తెలంగాణ కాంగ్రెస్ లో రెబల్ స్టార్ గా పేరొందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనూహ్య రీతిలో ఓటమి పాలయ్యారు. కారు జోరు ముందు నిలబడలేకపోయారు.  తాను ఓడిపోయానని నిన్న తెలియగానే కృంగిపోయి గుండెనొప్పితో బాధపడి ఆస్పత్రి పాలైన కోమటిరెడ్డి కోలుకున్నారు. తాజాగా బుధవారం ఉదయం తన దినచర్యను రోజులాగే అంతే ఉత్సాహంగా ప్రారంభించారు..ఓడిపోతే కృంగిపోయిన వెంకట్ రెడ్డి ఈరోజు దినచర్యను ఉత్సాహంగా ప్రారంభించారు. 20 ఏళ్లుగా తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. ఆ మార్పును స్వాగతిస్తున్నానని వెంకట్ రెడ్డి భావిస్తున్నారు.

బుధవారం ఉదయం హైదరాబాద్ లోని జిమ్ కు వెళ్లి ఉల్లాసంగా అందరితో కలిసి వ్యాయామం చేశారు. ఫలితాలతో ఈరోజు నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. మరోవైపు అధిష్టానం ముందు పట్టుబట్టి సాధించుకున్న మునుగోడు నకిరేకల్ సీట్లలో ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి చిరుమర్తి లింగయ్యలను మాత్రం గెలుపొందారు.

రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్  నేతగా.. అపర కుభేరుడిగా పేరొందిన కోమటిరెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం క్యాండిడేట్ గా భావించారు. కానీ అనూహ్య రీతిలో ఓడిపోయి ఇప్పుడు సేదతీరుతున్నాడు.