Begin typing your search above and press return to search.

బుక్ రాసిన ‘రఘు’కు ఏమవుతుందో?

By:  Tupaki Desk   |   26 July 2016 8:05 AM GMT
బుక్ రాసిన ‘రఘు’కు ఏమవుతుందో?
X
మన రాష్ట్రం వస్తే మనకు నచ్చినట్లుగా పాలించుకోవచ్చు. మనోళ్లే పాలకులైతే మనకిక కష్టాలే ఉండవు. ఈ మాటను సగటు తెలంగాణవాది మొదలు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కీలక నేతల్లో ఒకరైన కోదండం మాష్టారి మాటల్లోనూ వినిపించేది. ఎన్నో ఏళ్లుగా చెప్పిన ఈ మాట తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. ప్రభుత్వం కొలువు తీరిన 25 నెలలకే అందుకు భిన్నమైన వ్యాఖ్య రావటం సంచలనంగా మారింది.

విద్యుత్ రంగం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణుల కారణంగా తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరిస్తూ.. విద్యుత్ రంగ నిపుణుడు రఘు తాజాగా ఒక పుస్తకాన్ని రాశారు. ‘‘తెలంగాణ విద్యుత్ రంగంలో ఏం జరుగుతోంది’’ అంటూ రాసిన ఈ పుస్తకాన్ని తాజాగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర సర్కారు పరపతిని దెబ్బ తీసేలా ఉండటంతో పాటు.. తెలంగాణలో వాస్తవిక పరిస్థితిని తెలియజేసేలా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.

విద్యుత్ రంగం మీద తీసుకొచ్చిన పుస్తం తరహాలోనే మరిన్ని రంగాల మీద కూడా పుస్తకాల్ని విడుదల చేయనున్నట్లుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు చెప్పగా.. పుస్తకం రాసిన రఘుపై కోదండం రాం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎంతో శ్రమకోర్చి రఘు ఈ పుస్తకాన్ని రాసినట్లుగా చెప్పిన కోదండరాం.. ‘‘బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే విద్యుత్ లభిస్తున్నా.. ప్రభుత్వం రాత్రికి రాత్రే ప్లాన్ లు రూపొందించి థర్మల్ ప్రాజెక్టులకు పునాదులు వేస్తుందంటూ రఘు పుస్తకంలో రాశారు. ఇది రాసినందుకు.. మమ్మల్నే అడుగేటోడు అయిండా అని ప్రభుత్వం రఘును నిలదీస్తుంది. రఘుకు ఏం జరుగుతుందో ఏమో..? ఏమైనా జరిగితే మీరంతా వెంట ఉంటారు కదా?’’ అంటూ కోదండం సభికుల్ని ఉద్దేశించి అడగటం కనిపించింది.

తమ వాళ్ల పాలనలో తెలంగాణలో తాము కోరుకున్నట్లుగా జరుగుతుందన్న మాటల్ని ఉద్యమ సమయంలో చెప్పిన కోదండం మాష్టారు లాంటి వారి నోటి నుంచి ఇలాంటి బేల మాటలు రావటం దేనికి నిదర్శనం? అన్న ప్రశ్నలకు వినిపిస్తున్నాయి. దీనికి సమాధానం చెప్పేవారెవరు..?