Begin typing your search above and press return to search.

కోదండ‌రాంను రౌండప్ చేసి క‌న్ఫ్యూజ్ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   14 Oct 2018 8:17 AM GMT
కోదండ‌రాంను రౌండప్ చేసి క‌న్ఫ్యూజ్ చేస్తున్నారు
X
తెలంగాణ జేఏసీ మాజీచైర్మ‌న్, తెలంగాణ జ‌న‌స‌మితి పార్టీ నాయ‌కుడు ప్రొఫెస‌ర్ కోదండరాం క్రాస్‌రోడ్స్‌ లో ఉన్నారా? రాజ‌కీయ అరంగేట్రం ద‌శ‌లోనే ఆయ‌న్ను అటు ప్ర‌త్య‌ర్థులు ఇటు మిత్ర‌ప‌క్షం గంద‌ర‌గోళంలో ప‌డేస్తోందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. తాజాగా ఆయ‌న కేంద్రంగా సాగుతున్న చ‌ర్చ‌ల‌ను గ‌మ‌నించిన వారు కోదండ‌రాంను ఇర‌కాటంలో ప‌డేశార‌ని పేర్కొంటున్నారు. కేసీఆర్‌ను గద్దె దింపటమే లక్ష్యంగా ఐకమత్యంతో ముందుకుపోవాలని కాంగ్రెస్‌-టీడీపీ-సీపీఐ కూటమి క‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే, సీట్ల కేటాయింపులో పేచీ మొద‌లైంద‌ని తెలుస్తోంది. చర్చల్లో కొంత పురోగతి కనిపించినా సీట్ల సంఖ్య విషయంలో అటు కాంగ్రెస్‌, ఇటు టీజేఎస్‌ మధ్య ఏకాభిప్రాయం కుదరటం లేదు. కూటమిలోని తెలుగుదేశం, సీపీఐ పట్టువిడుపుల ధోరణి ప్రదర్శిస్తున్నాయని కానీ కోదండ‌రాం వ‌ల్లే తుది నిర్ణ‌యం వెలువ‌డటం లేద‌ని కొంద‌రి భావ‌న‌.

కూటమిలోని ప్రధాన పక్షమైన తమ పార్టీ 98 స్థానాల్లో పోటీచేస్తుందని, టీడీపీకి 12, టీజేఎస్‌కు 6, సీపీఐకి 3 స్థానాలు కేటాయించాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్‌ పార్టీ ఒక ఫార్ములా ప్రతిపాదించింది. దీనికి భిన్నంగా టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం మరో ప్రతిపాదన చేసినట్టు తెలిసింది. దీని ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ 80, టీజేఎస్‌ 20, టీడీపీ 15, సీపీఐ 4 స్థానాల్లో పోటీ చేస్తే బాగుంటుందని సూచించారు. ఈ ప్రతిపాదనను కూడా కాంగ్రెస్‌ వ్యతిరేకించింది. మధ్యే మార్గంగా కాంగ్రెస్‌కు 90, టీడీపీకి 14, టీజేఎస్‌కు 8, సీపీఐకి 7 స్థానాలు కేటాయించాలని టీడీపీ, సీపీఐ నేతలు ప్రతిపాదించినట్టు కూటమి వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనతో కూడా టీజేఎస్‌ ఏకీభవించక పోవటంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడినట్టు చెప్తున్నారు. కేవలం మూడు సీట్ల కోసం కోదండరాం కాంగ్రెస్‌ పార్టీ పంచన చేరారని టీఆర్ఎస్‌ నేతలు చేస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకుని గౌరవప్రదమైన రీతిలో తమకు కేటాయింపులు ఉండాలని కోదండరాం అంటున్నారు. తమ పార్టీకి 16 సీట్లు కేటాయించాల్సిందేనని కోదండరాం పట్టుపడుతున్నట్టు తెలిసింది.

అయితే ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ నిర్ణ‌యం చ‌ర్చ‌నీయాశంగా మారింది. రాష్ట్రంలోని 119 స్థానాలకు అభ్యర్ధుల్ని ఎంపిక చేసే పనిలో కాంగ్రెస్‌ నిమగమై ఉంది. భక్తరంజన్‌దాస్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ జిల్లాల వారీగా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ముందుగా వడపోత కార్యక్రమం చేపట్టి కూటమిలోని ఇతర పార్టీలకు కేటాయించే సీట్లకు కాంగ్రెస్‌ అభ్యర్ధుల్ని ప్రకటించకూండా పెండింగ్‌లో పెట్టాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ ప‌రిణామం, సీట్ల పెండింగ్‌లో జాప్యం నేప‌థ్యంలో సీట్ల కేటాయింపు విషయంలో తమను కాంగ్రెస్‌ చిన్న చూపు చూస్తున్నదని, అవసరమైతే తమను వదిలించుకుని ముందుకు పోతామంటూ కొందరు నేతలు లీక్‌లు ఇస్తున్నారని కోదండరాం ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. మహాకూటమికి కోదండరాంను చైర్మెన్‌గా ప్రకటించాలనే అంశంపై కూడా కాంగ్రెస్‌ నేతలు స్పష్టత నివ్వక పోవటం చర్చనీయాంశంగా మారింది. వెర‌సి కోదండ‌రాం కూట‌మి క్రాస్‌రోడ్స్‌లో ఉన్నార‌ని అంటున్నారు.