Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ తాను ఒక‌టే అంటున్న కోదంండ‌రాం

By:  Tupaki Desk   |   21 Feb 2017 2:20 PM GMT
కేసీఆర్‌ తాను ఒక‌టే అంటున్న కోదంండ‌రాం
X
తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ప్ర‌తిపాదించిన నిరుద్యోగుల ర్యాలీ నిర్వ‌హ‌ణ కంటే ముందే వార్తల్లో నిలుస్తోంది. ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి అనుమతి ఇవ్వబోమని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల నిర్ణ‌యాన్ని హైకోర్టులో స‌వాల్ చేసిన జేఏసీకి చుక్కెదురైంది. నిరుద్యోగ ర్యాలీకి అనుమ‌తి ఇచ్చేది లేద‌ని, కావాలంటే నాగోలు మెట్రో మైదానంలో టీజేఏసీ స‌భ‌కు అనుమ‌తి ఇస్తామ‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ నేపథ్యంలో కోదండరాం నివాసంలో జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే ఉస్మానియా వర్శిటీలో సభ నిర్వహించుకునేందుకైనా అనుమతి ఇవ్వాలని జేఏసీ కోరింది. ఈ విషయమై కొంత మంది జేఏసీ నేతలు నగర సీపీని కలిసి వినతిపత్రం ఇచ్చి.. తిరిగి వస్తున్న తరుణంలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్డులో వారిని పోలీసులు ఆపి ర్యాలీకి అనుమతి నిరాకరిస్తున్నట్లు నోటీసులు అందజేశారు

కాగా, కోదండ‌రాం మీడియాతో మాట్లాడారు. జేఏసీ తలపెట్టిన ర్యాలీకి చాలా రోజుల కిందనే ప‌ర్మిషన్ అడిగామ‌ని తెలిపారు. నిజాం కాలేజ్ - నెక్లస్ రోడ్ కూడా అడిగామ‌ని నిజాం కాలేజ్ ఇస్తామ‌ని మొదట చెప్పిన పోలీసులు ఒత్తిడితో ఇవ్వలేదని ఆరోపించారు. ఓయూ కాలేజీ స్థ‌లాన్ని అడిగినా పోలీసులు మళ్లీ అదే మాట చెప్పార‌ని దుయ్య‌బ‌ట్టారు. అదివారానికి మార్చుకోండ‌ని చెప్పి ఏ సభకు సరిపోని మెట్రో రైల్‌ గ్రౌండ్ ఇచ్చార‌ని మండిప‌డ్డారు. ఆ విష‌య‌మైన త‌మ‌కు ముందు చెప్పిన ఒప్పుకునే వాళ్ళమ‌ని చివరి నిమిషంలో చెప్ప‌డం సిగ్గు చేటని ద్వ‌జ‌మెత్తారు. ఈ సంద‌ర్భంగా త‌మ‌కు నేరపూరిత చరిత్ర ఉందని, విధ్వంసం జరిగిందని, మా పై తెలంగాణ కేసులు చూపించి అనుమ‌తి నిరాకరించారడంప‌ట్ల కోదండ‌రా విస్మ‌యం వ్య‌క్తం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కుట్రగా చిత్రీకరిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌పై పోలీస్ ల ఆరోపణలు నిజమైతే త‌న‌తో పాటు ఉద్యమంలో ఉన్న కేసీఆర్ కు కూడా అవి వర్తిస్తాయని అన్నారు. సమైక్య పాలకుల లాగే ఈ పాలకులు వ్యవహరిస్తున్నార‌ని ఆరోపించారు.

యువకుల గొంతు అణచివేసే ప్రక్రియలో భాగంగా అనుమ‌తి నిరాకరించార‌ని కోదండ‌రాం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ వెనక తీవ్రవాదులు ఎవరు ఉన్నారని ప్ర‌శ్నించారు. నిరుద్యోగులు - తెలంగాణ కోసం కొట్లాడిన యువకులను తీవ్రవాదులు గా ముద్ర వేశారని అయినా సర్కార్ ఎందుకు స్పందించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ఇదేమి ప్రజాస్వామ్యం అని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత కక్ష - సంబంధం లేని వాదనతో అనుమతి ఇవ్వలేదని కోదండ‌రాం ఆరోపించారు. నిరసన అనేది రాజ్యాంగ హక్కు అని పేర్కొంటూ అన్నా హజారే ఢిల్లీలో ర్యాలీ సమయంలో అనుమతి నిరాకరిస్తే శాంతి భద్రతలు మీరు చూసుకోవాలని పోలీసుల‌కు సుప్రీంకోర్టు చెప్పింద‌ని గుర్తు చేశారు. నిరుద్యోగుల ర్యాలీలో భాగంగా ఇప్ప‌టికే 600 మంది అరెస్ట్ అయ్యార‌ని, రేపటికి ఈ సంఖ్య భారీగా పెరుగుతుంద‌ని వ్యాఖ్యానించారు. అందుకే ఎక్కడికక్కడ శాంతియుతంగా నిరసన తెలపాల‌ని కోదండ‌రాం కోరారు. ఉద్యమ సమయంలో ఉన్న వాదన‌తోనే రేపటి నిరసన ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. 10 గంటలకు తాను ఇంట్లో నుంచి నిరసనకు బయలుదేరుతాన‌ని కోదండరాం ప్ర‌క‌టించారు.నిరుద్యోగుల ర్యాలీ ముందు అనుకున్నట్లే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ బర్త్ డే వేడుకలకు లేని ఇబ్బంది నిరుద్యోగుల నిరసనకు ఏముంద‌ని ప్ర‌శ్నించారు. రోడ్లను మూసి, ట్రాఫిక్ ఆపి మీరు కార్యక్రమాలు చేస్కోలేదా అని నిల‌దీశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/