Begin typing your search above and press return to search.

కిమ్ సోద‌రుడి హ‌త్య మిస్ట‌రీ వీడ‌లేదే!

By:  Tupaki Desk   |   11 Oct 2017 11:44 AM GMT
కిమ్ సోద‌రుడి హ‌త్య మిస్ట‌రీ వీడ‌లేదే!
X
త‌న క్షిప‌ణి ప‌రీక్ష‌ల‌తో ప్ర‌పంచానికే స‌వాలు రువ్విన ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ సోదరుడు కిమ్‌ జాంగ్‌ నామ్‌ హత్య జ‌రిగి చాలా నెల‌లే అయింది. అయినా కూడా ఈ హ‌త్య ఎలా జ‌రిగిందో ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న కిమ్‌ జాంగ్‌ నామ్‌ను కౌలాలంపూర్‌ ఎయిర్‌ పోర్ట్‌ తనిఖీ విభాగం వద్ద విష ప్రయోగం జ‌రిగింద‌ని మాత్రమే ఇప్ప‌టి వ‌ర‌కు తెలిసిన విష‌యం. అయితే, ఈ విష ప్ర‌యోగం ఎందుకు జ‌రిగింది? ఎవ‌రు చేశారు? వ‌ంటి అనేక అంశాలు మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు. అయితే, ఈ కేసులో ఇద్ద‌రు మ‌హిళ‌లు మాత్రం అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

అయితే, వారు మాత్రం త‌మ‌కు ఈ హ‌త్య‌కు సంబంధం లేద‌ని, తాము చేయ‌లేద‌ని చెబుతున్నారు. అయితే, వారు మాత్రం త‌మ‌తో ఎవ‌రో చేయించార‌ని, రియాల్టీ షోగా చెప్ప‌డం వ‌ల్లే దీనిలో తాము పాల్గొన్నామ‌ని వారు అంటున్నారు. దీంతో ఈ కేసు ప‌లు మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా అభియోగాలు ఎదుర్కొంటున్న మ‌హిళ‌ల అభ్య‌ర్థ‌న మేర‌కు అప్ప‌టి ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను కోర్టులో ప్ర‌ద‌ర్శించారు. ఈ వీడియోలో కిమ్‌ జాంగ్‌ నామ్‌ వస్తుండగా వియత్నాంకు చెందిన మహిళగా అనుమానిస్తున్న డోవాన్‌ తి హువాంగ్‌ తన రెండు చేతులతో నామ్‌ ముఖాన్ని గట్టిగా ఓసారి మూసి వెళ్లినట్లు కనిపించింది.

అయితే, నామ్‌పై దాడిలో స్వయంగా సితీ ఐసియాహ్‌ అనే ఇండోనేషియా మహిళ లేనప్పటికీ వేరే డైరెక్షన్‌ లో ఆమె పారిపోతున్నట్లు కనిపించింది. ఇక‌, ఈ సంఘటన జరగడానికి రెండు రోజుల ముందు హువాంగ్‌ ప్రవర్తన చాలా భయానకంగా ఉందని ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి వాన్‌ అజిరుల్‌ నిజామ్‌ చేవాన్‌ అజిజ్ కోర్టుకు సాక్ష్యం ఇచ్చారు. అంతేకాదు, హువాంగ్‌ కోర్టును తప్పుదోవ పట్టిస్తోంద‌ని, నామ్‌ ను ఏమాత్రం క్షమించరాదనే దోరణితో ఆమె వ్యవహరించిందని, ఎట్టి పరిస్థితుల్లో ఆమెను శిక్షించాలని పేర్కొన్నారు. దీనిపై విచార‌ణ ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది.