Begin typing your search above and press return to search.

బూతు క్లిప్ పై కిలారి సుదీర్ఘ వివ‌ర‌ణ‌

By:  Tupaki Desk   |   16 Aug 2017 5:07 AM GMT
బూతు క్లిప్ పై కిలారి సుదీర్ఘ వివ‌ర‌ణ‌
X
జీహెచ్ ఎంసీ కార్పొరేట‌ర్ కిలారి మ‌నోహ‌ర్ ఫోన్ నుంచి ఒక డ‌ర్టీ పిక్చ‌ర్ (బూతు వీడియో) జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్ల వాట్సాప్ గ్రూపులో పోస్ట్ కావ‌టం.. ఆ గ్రూపులో తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమారుడు క‌మ్ మంత్రి కేటీఆర్‌.. కుమార్తె క‌మ్ ఎంపీ అయిన క‌విత స‌భ్యులుగా ఉండ‌టం.. వారే కాక ప‌లువురు ఉన్న‌తాధికారులు.. మ‌హిళా నేత‌లు ఉండ‌టం.. వారంతా ఈ ఉదంతంతో షాక్ తిన‌టం తెలిసిందే. కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ ఉదంతం సృష్టించిన క‌ల‌క‌లం అంతాఇంతా కాదు. డ‌ర్టీ పిక్చ‌ర్ అంశం దెబ్బ‌కు కిలారి ఇమేజ్ దారుణంగా దెబ్బ తింద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా డ‌ర్టీపిక్చ‌ర్ ఉదంతంపై కిలారి స్పందించారు. జ‌రిగిన దాన్లో త‌న త‌ప్పు అస్స‌లు లేద‌ని చెప్పిన ఆయ‌న‌.. జ‌రిగిందేమిటో తెలుసా? అంటూ సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. డ‌ర్టీ పిక్చ‌ర్ పోస్ట్ అన్న‌ది త‌న ప్ర‌మేయం లేకుండా జ‌రిగిపోయింద‌ని.. త‌న ఫోన్ నుంచి పోస్ట్ కావ‌టంతో తాను అప్పుడే సారీ చెప్పాన‌న్నారు. అయిన‌ప్ప‌టికీ ఈ వివాదం ముగియ‌కుండాకొన‌సాగుతుండ‌టంపై ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

త‌న‌ను రాజ‌కీయంగా దెబ్బ తీసేందుకు కొంద‌రు రార్దాంతం చేస్తున్నార‌న్న కిలారి వాస్త‌వంగా జ‌రిగింది వేర‌న్నారు. గ‌త నెల 31న కాఫీ విత్ కార్పొరేట‌ర్ కార్య‌క్ర‌మంలో భాగంగా త‌న ఫోన్ ను త‌న డ్రైవ‌ర్‌కు ఇచ్చి వెళ్లాన‌న్నారు. అయితే.. త‌న డ్రైవ‌ర్ నుంచి త‌న ఫోన్ ను ర‌వి అనే పార్టీ కార్య‌క‌ర్త తీసుకున్నాడ‌న్నారు. అత‌ను నెట్ చూస్తూ..కొన్ని చిత్రాల్ని డౌన్ లోడ్ చేశాడ‌న్నారు.

అయితే.. త‌న ఫోన్ లోకి పోస్ట్ చేసుకోవాల్సింది పోయి.. జీహెచ్ఎంసీ గ్రూపులోనూ.. త‌న బిజినెస్ గ్రూపుల్లోనూ పోస్ట్ చేశార‌న్నారు. ఈ విష‌యం త‌న‌కు తెలిసిన వెంట‌నే.. పోస్ట్ ను డిలీట్ చేసి.. బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పిన‌ట్లుగా గుర్తు చేశారు. ఈ ఉదంతంపై డ్రైవ‌ర్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌గా.. ఫోన్ ను ర‌వి అనే కార్య‌క‌ర్త తీసుకున్న‌ట్లుగా చెప్పాడ‌ని.. అత‌డ్ని ప్ర‌శ్నిస్తే.. చేసిన త‌ప్పును అంగీక‌రించి క్ష‌మాప‌ణ‌లు చెప్పార‌న్నారు.

ఈ ఉదంతం త‌న‌ను.. త‌న కుటుంబాన్ని తీవ్రంగా క‌లిచివేసింద‌ని.. రెండు మూడు రోజులుగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రం కుంగిపోతున్న‌ట్లుగా చెప్పారు. త‌న‌ను ఎన్నుకున్న వెంగ‌ళ‌రావు న‌గ‌ర్ ప్ర‌జ‌ల‌కు ఎప్పుడూ త‌ల‌వంపులు తేన‌ని చెప్పారు మ‌నోహ‌ర్‌. అంతా బాగానే ఉంద‌ని అనుకున్నా.. ఒక కార్పొరేట‌ర్ ఫోన్ ను ఆయ‌న డ్రైవ‌ర్ ఒక కార్య‌క‌ర్త‌కు అడిగినంత‌నే ఇచ్చేస్తారా? ఫోన్ తీసుకొని ఏదేదో చూస్తుంటే.. చూసీచూడ‌న‌ట్లుగా స‌ద‌రు డ్రైవ‌ర్ చూస్తూ ఉండిపోతారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌లుగా మారాయి.