Begin typing your search above and press return to search.

సీబీఐ కేసులో హైద‌రాబాద్ మాజీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   20 Nov 2018 11:12 AM GMT
సీబీఐ కేసులో హైద‌రాబాద్ మాజీ ఎమ్మెల్యే
X
సీబీఐ వర్సెస్ సీబీఐ కేసు పెను సంక్షోభానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఏకంగా కేంద్రమంత్రి హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి - జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ - ఛీఫ్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) కేవీ చౌదరి పేర్లు వినిపిస్తుండటం సంచలనంగా మారింది. సీబీఐ దృష్టిలో ఉన్న ఓ వ్యాపారవేత్త తరఫున జోక్యం చేసుకునేందుకు కేంద్ర మంత్రి పార్థిభాయ్ చౌదరి కొన్ని కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నారని సీబీఐ అధికారి - ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ మనీశ్ సిన్హా ఆరోపించారు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాపై దర్యాప్తు విషయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ - ఛీఫ్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) కేవీ చౌదరి జోక్యం చేసుకున్నారని దేశ అత్యున్నత న్యాయస్థానం ఎదుట సోమవారం దాఖలు చేసిన తన 34 పేజీల పిటిషన్‌ లో పేర్కొన్నారు.

కాగా నెల రోజులుగా నడుస్తున్న సీబీఐ అంతర్గత అవినీతి వ్యవహారంలో మరోకోణం బయటపడింది. మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి ల‌క్ష్మారెడ్డి పేరు వెల్లడి కావడం సంచలనం రేకెత్తించింది. ఈ పరిణామంతో కాంగ్రెస్‌ వర్గాల్లో కలవరం మొదలైంది. సీబీఐ డీఐజీ మనీశ్‌ కుమార్ సిన్హా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ లో పలు అంశాలు వెలుగుచూశాయి. మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి ఆయన బంధువు గోరంట్ల రమేశ్‌ కు అనుకూలంగా సానా సతీశ్‌ కు - ఖురేషీలకు సహాయపడ్డారని మనీశ్ ఆరోపించారు. సీబీఐ అదనపు డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా సీవీసీ చెప్పినట్టు నడుచుకున్నారని పేర్కొన్నారు. మేడ్చల్ కాంగ్రెస్‌ నేత కిచ్చన్నగారి ల‌క్ష్మారెడ్డి-సానా సతీశ్‌ల ఫోన్ సంభాషణల్లో రూ.2కోట్లు కేంద్ర బొగ్గు - మైనింగ్‌ శాఖ మంత్రి హరిభాయ్ చౌదరికి ముట్టినట్టు జూన్ తొలివారాల్లో మా ట్లాడుకున్నారని, మరో కేంద్ర నిఘా సంస్థ దర్యాప్తులో బయటపడ్డాయి. ఈ విషయం సీబీఐ దర్యాప్తులో వెల్లడైందని మనీశ్ పిటిషన్‌ లో తెలిపారు. దీనిపై సోమవారం జాతీయ మీడియాలోనూ వచ్చిన కథనాలు హల్‌ చల్ చేశాయి.