Begin typing your search above and press return to search.

రేప్ చేస్తారని భయం వేస్తుంది!

By:  Tupaki Desk   |   3 Sep 2015 5:03 AM GMT
రేప్ చేస్తారని భయం వేస్తుంది!
X
ఇంట్లో మగాడు తప్పుచేస్తే... ఆ ఇంట్లో ఆడపడుచుని రేప్ చేసి, మొఖానికి మసుపూసి నగ్నంగా ఊరేగించాలని తీర్పు వెలువండింది. ఇది కోర్టులో కాదు సుమా... ఊరి పంచాయితీ తీర్పు! వినడానికి అసహ్యంగానూ, అత్యంత జుగుప్సాకరంగానూ, ఇప్పుడు మనం ఉన్నవి ఏరోజులు అనే అనుమానం రేకెత్తించేవిగానూ ఉన్న ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని భాగ్ పేట్ సమీపంలోగల సంక్రోట్ అనే గ్రామంలో జరిగింది! మరో విషయం ఏమిటంటే... ఈ గ్రామం దేశ రాజధానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది!

వివారాళ్లోకి వెళితే... యూపీలోని సంక్రోట్ గ్రామంలో ఏడువేల మంది జాట్ లు ఉండగా.. 250 మంది దళిత కుటుంబస్తులు ఉన్నారు. కుల జాడ్యం పుష్కలంగా ఉన్న ఆ గ్రామంలో జాట్ కులానికి చెందిన 21 ఏళ్ల కృష్ణ అనే అమ్మాయిని, దళిత కుటుంబానికి చెందిన రవి అనే 25 ఏళ్ల యువకుడు ప్రేమించాడు. ఈ పెళ్లి జరిగిన అనంతర పరిణామాలు గ్రహించిన రవి కుటుంబ సభ్యులు.. తన ప్రేమను చంపుకోమని, అలా కాని పక్షంలో కుటుంబం మొత్తం వారి చేతులో చనిపోతుందని వేడుకున్నారు. వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోగలిగిన మనసున్న రవి.. మనసు చంపుకున్నాడు! ప్రేయసి కృష్ణని ఒప్పించాడు! ఈ విషయం తెలియడంతో అప్పటికే ఆమె ఇంట్లో టార్చర్ మొదలయ్యింది. అనంతరం ఆమెకు హర్యానాలో వారి కులస్థుడికే ఇచ్చి పెళ్లిచేశారు. కులం ఒక్కటైనంత మాత్రాన్న కాపురాలు సాఫీగా జరిగిపోతాయా వారి పిచ్చి కాకపోతేను! నాలుగురోజులు కాపురం చేసి తిరిగి ఊరికి పారిపోయి వచ్చేసింది కృష్ణ. విషయం తెలుసుకున్న రవి.. కృష్ణ జీవితం ఇలా అయిపోవడానికి తాను కూడా ఒక కారణం అని గ్రహించి ఆమెను రహస్యంగా పెళ్లిచేసుకున్నాడు!

ఈ విషయం తెలిసిన జాట్ కులస్థులు.. కులానికి ఇచ్చే ప్రాదాన్యత కన్న కూతురికి ఇవ్వలేని మూర్ఖత్వంలో పడిపోయి... తమకున్న పలుకుబడితో రవిని మాదకద్రవ్యాల కేసులో ఇరికించి మీరట్ జైలుకి పంపించారు. అనంతరం ఊరి పెద్దలు పంచాయితీ సమావేశం ఏర్పాటుచేసి... రవి చెల్లెళ్లను రేప్ చేయాలని, అనంతరం మొఖానికి మసిపూసి నగ్నంగా ఊరేగించాలని తీర్పు చెప్పింది. అదృష్టవసాత్తు ఆ సమయానికి ఒక వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చిన వారి కుటుంబానికి ఈ విషయం తెలిసింది. రవి చెల్లెలు మీనాక్షి తన కుటుంబంతో.. ఢిల్లీలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పెద్దన్నయ్య సుమిత్ ఇంటికి వచ్చింది! వారిని ఊరు పంపే సాహసం చేయలేక, సమీపంలోని ఒక గ్రామంలో రహస్యంగా దాచి ఉంచాడు సుమిత్!

దేశం గొడ్డుపోలేదు అని నమ్మిన ఆ కుటుంబ సభ్యులు.. పోలీసులను, కోర్టులను, రాజకీయ నాయకులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది! ఈ మేరకు ప్రధానికి, ముఖ్యమంత్రికి కూడా మీనాక్షి లేఖలు రాసింది. ప్రస్తుతం ఈ కేసును వారి కుటుంబం కోసం న్యాయవాది రాహుల్ త్యాగి సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. ఇంకా సమాజంలో ఇటువంటి పరిస్థితులు ఉండటం దారుణమని చెబుతూ మనవ హక్కుల సంఘాలను కూడా ఆశ్రయించారు. బాదిత కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని, ఆ దిశగా న్యాయం జరుగుతుందని, దేశన్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసముందని న్యాయవాది చెబుతున్నారు!