Begin typing your search above and press return to search.

టాప్ 5: ఈ సీట్లు వైఎస్సార్సీపీకి ప్రతిష్టాత్మకం!

By:  Tupaki Desk   |   25 April 2019 6:27 AM GMT
టాప్ 5: ఈ సీట్లు వైఎస్సార్సీపీకి ప్రతిష్టాత్మకం!
X
ఈ ఎన్నికల్లో విజయమే కాదు.. ప్రత్యేకించి కొన్ని సీట్లలో విజయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. కొన్ని సీట్లను నిలబెట్టుకోవడం - కొన్నింట జెండా పాతడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రిస్టేజ్ ఇష్యూగా మారింది. ఆ సీట్లలో అందుకు అనుగుణంగా స్పందించింది జగన్ పార్టీ. గట్టిగా పోరాడింది. తెలుగుదేశం పార్టీతో అన్ని రకాలుగానూ ఢీ అంటే ఢీ అంది. ఇక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేదే కొశ్చన్ మార్క్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఫలితం విషయంలో ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాలు ఇవే…

జమ్మలమడుగు: ఈ సీటును నిలబెట్టుకోవడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కఠినమైన పరీక్ష. గత ఎన్నికల్లో ఈ సీట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి ఫిరాయించి - మంత్రి పదవి తీసుకుని జగన్ మీద ఎలా ఎగెరెగిరిపడ్డారో అందరికీ తెలిసిందే. ఆది ఇక్కడ నుంచి మళ్లీ పోటీ చేయకపోయినా చిరకాల ప్రత్యర్థి రామసుబ్బారెడ్డి కోసం ఆదినారాయణ రెడ్డి పని చేశారు. తెలుగుదేశం విజయం కోసం వారు అన్ని అస్త్రాలనూ ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ విజయాన్ని వైఎస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేసింది. అందుకు తగ్గట్టుగా హోరాహోరీగా పోరు జరిగింది. జమ్మలమడుగు ఫలితం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకం అయ్యింది.

పులివెందుల: ఇక్కడ విజయం కాదు ప్రధానం. మెజారిటీ. జగన్ కు ఈ సారి ఎంత మెజారిటీ వస్తుందనేది ఆసక్తిదాయకమైన అంశం. వైఎస్సార్సీపీకి ఇదే ప్రతిష్టాత్మకమైన అంశం. గత ఎన్నికల్లో కూడా జగన్ బ్రహ్మాండమైన మెజారిటీని సాధించారు. ఈ సారి అంతకు మించి సాధిస్తారా, లేక తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో గెలుస్తామనే తమ సవాల్ ద్వారా జగన్ మెజారిటీని ఏమైనా తగ్గించగలుగుతుందా అనేది చూడాల్సిన అంశం. పులివెందుల్లో జగన్ మెజారిటీ అంశం ప్రతిష్టాత్మకం.

రాప్తాడు: ఈ సారి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గాల్లో ఒకటి రాప్తాడు. ఇక్కడ నుంచి జగన్ పార్టీ గట్టిగా పోరాడింది. విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేసింది. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇవే తనకు చివరి ఎన్నికలు అన్నట్టుగా పని చేశాడు. రెండు మూడేళ్ల వ్యవధి నుంచి తీవ్రంగా కష్ట పడ్డారాయన. అందుకు తగ్గట్టుగా అనుకూలత కూడా కనిపించింది. అయితే ఆఖర్లో పరిటాల వాళ్లు విజృంభించి పని చేశారు. వైఎస్సార్సీపీ అన్ని రకాలుగానూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేసిన నియోజకవర్గాల్లో రాప్తాడు ఒకటవుతుంది. ఇక్కడ ఎలాంటి ఫలితం రాబోతోందనేది ఆసక్తిదాయకమైన అంశం.

మంగళగిరి: తెలుగుదేశం పార్టీకి ఇది ఎంత ప్రతిష్టాత్మకమో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంతే ప్రతిష్టగా మారింది. ఇక్కడ గెలిస్తే తెలుగుదేశం పార్టీ భవితవ్యానికే దెబ్బేసినట్టుగా అవుతుందనేది వైఎస్ ఆర్ కాంగ్రెస పార్టీ లెక్క. అందులోనూ అక్కడ జగన్ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. కాబట్టి సీటును నిలబెట్టుకోవడం అనేది ఎంతో ప్రతిష్టాత్మకం అవుతుంది. అందుకే ఇక్కడ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పోరాడింది. ఉన్నంతలో అన్ని అవకాశాలనూ ఉపయోగించుకుని పోటీ ఇచ్చింది. ఇరు పార్టీలకూ ప్రతిష్టాత్మకం అయిన ఈ సీట్లో ఫలితం ఎలా ఉంటుందనేది సర్వత్రా చర్చనీయాంశం.

నగరి - చంద్రగిరి: దాదాపు ఒకే రకమైన పరిస్థితులు ఉన్న నియోజకవర్గాలు ఇవి. వీటిల్లో విజయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒకే స్థాయి ప్రతిష్టాత్మకం. వైఎస్సార్సీపీ ఫైర్ బ్రాండ్స్ గా పేరు పొందిన ఆర్కే రోజా - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల విజయం ఆ పార్టీకి ఎంతో కీలకం. తెలుగుదేశం పార్టీతో మాట యుద్ధంలో ఢీ అంటే ఢీ అనే వాళ్లు వీళ్లిద్దరూ. ఐదేళ్లుగా అదే జరిగింది. ఈ నేపథ్యంలో వీరి విజయం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా కష్టపడింది. ఇక ఈ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఢీ అంటే ఢీ అంది. దీంతో వీటిల్లో ఫలితం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.