Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుకు క‌విత ఫోన్ ..!

By:  Tupaki Desk   |   25 May 2016 1:52 PM GMT
చంద్ర‌బాబుకు క‌విత ఫోన్ ..!
X
విభ‌జ‌న జ‌రిగి రెండేళ్లు పూర్తికావొస్తోంది. ఇప్పుడిప్పుడే రెండు రాష్ట్రాల మ‌ధ్య స‌మ‌స్య‌లు కొలిక్కి వ‌స్తున్నాయి. సరిగ్గా ఇదే స‌మ‌యంలో.. ప్రాజెక్టుల వివాదం తెర‌పైకి వ‌చ్చింది. నీటి అంశంలో రెండు రాష్ట్రాల మ‌ధ్య తీవ్ర‌మైన మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌డుతున్న‌ ఎత్తిపోత‌ల ప‌థ‌కాల వ‌ల్ల రాయలసీమ‌కు నీరు రాద‌ని.. ఏపీ వాదిస్తోంది. అయితే త్వ‌ర‌లో ఈ వివాదానికి ముగింపు ప‌ల‌క‌బోతున్నారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఈవిష‌యంలో ఇరు సీఎంలు మాట్లాడుకోబోతున్నార‌ని అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్టే! ఎందుకంటే నీటి స‌మ‌స్య‌పై మాట్లాడేందుకు కేసీఆర్ కుమార్తె - ఎంపీ క‌విత రంగంలోకి దిగార‌ట‌. నేరుగా సీఎం చంద్ర‌బాబుకు ఫోన్ చేసి మాట్ల‌డిన‌ట్లు స‌మాచారం.

రెండు ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ప్రత్యక్షమాటల యుద్ధానికి బ్రేక్ పడుతుందా? చర్చల ద్వారానే సమస్యకు ముగింపు పలకాలని ఎంపీ - తెలంగాణ జన జాగృతి అధ్యక్షురాలు కవిత నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రెండురాష్ర్టాల మధ్య ఓ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి జరుగుతున్న వివాదానికి ముగింపు పలకాలని అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే నీటి స‌మ‌స్య‌పై మాట్లాడుకుందామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఆమె ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. రెండుగా విడిపోయి రెండేళ్లు గడిచినా నీటి విషయంలో తలెత్తుతున్న వివాదానికి ఫుల్‌ స్టాప్ పెట్టాలని ఆమె భావిస్తున్నారట.

ఎంపీ స్వయంగా ఫోన్ చేసి ఈ స‌మ‌స్య‌పై చర్చించుకోవాలని భావిస్తున్నప్పుడు చర్చకు అంగీకరించాలా? వద్దా? అనేదానిపై చంద్రబాబు నాయుడు ఆలోచనలో పడ్డార‌ట‌. ఈ విషయమై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నారు. అయితే ఇంత‌లోనే.. కవిత తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు ఇన్‌ సైడ్ సమాచారం. మరి ఈ నీటి స‌మ‌స్య‌పై రెండురాష్ర్ట ప్రభుత్వాలు ఒకేతాటిపైకి వచ్చి విభేదాలను పరిష్కరించుకుంటే భ‌విష్య‌త్తులో మ‌ళ్లీ గొడ‌వ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌దు.