Begin typing your search above and press return to search.

రాహుల్ హాట్ పొలిటిషియన్ : కత్రినా కైఫ్

By:  Tupaki Desk   |   25 Sep 2018 12:16 PM GMT
రాహుల్ హాట్ పొలిటిషియన్ : కత్రినా కైఫ్
X
కత్రినా కైఫ్.. ఈ బ్రిటీష్ ఇండియన్ నటి విదేశాల నుంచి వచ్చి బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. బాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ ఆమెపై ఎన్నో విమర్శలు.. హావభావాలు, నటన అంతా బాగా రాదని సోషల్ మీడియాలో ఆడిపోసుకుంటారు. కొందరు పోటీ హీరోయిన్లు అయితే కత్రినాను ‘హాఫ్ ఇండియన్’ అంటూ తీవ్ర విమర్శలే చేశారు. దీనికి కౌంటర్ గా తనను రాహుల్ గాంధీతో పోల్చుకొని కత్రినా దిమ్మదిరిగే కామెంట్లు చేసింది. రాహుల్ గాంధీ కూడా హాఫ్ ఇండియనే అని నోరుజారింది. ఈ వివాదం ఎంత పెద్దది అయ్యిందో తెలిసిందే.. కాంగ్రెస్ నాయకులంతా కత్రినా కైఫ్ పై దుమ్మెత్తి పోశారు. ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకో అని వార్నింగ్ లు ఇచ్చారు.

ఇలా తనను తాను రక్షించుకోవడం కోసం రాహుల్ గాంధీని బలి చేసిన కత్రినా కైఫ్ తాజాగా రాహుల్ ని పొగిడేసింది. ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన కత్రినా.. ‘మీ దృష్టిలో హాటెస్ట్ రాజకీయ నేత ఎవరు?’ అంటే ఇద్దరి పేర్లను ప్రస్తావించింది. వారిలో ఒకరు అమెరికన్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కాగా.. రెండో వ్యక్తి రాహుల్ గాంధీ అని వెల్లడించింది. వీళ్లిద్దరూ హాటెస్ట్ పొలిటీషియన్ అని కత్రినా కుండబద్దలు కొట్టింది. ఇలా ఓసారి నోరు జారి.. ఇప్పుడు పొగిడి రాహుల్ పై తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకుంది ఈ హాట్ హీరోయిన్.