Begin typing your search above and press return to search.

ఫ్లవర్ వాజ్ కాదు.. ప్రాణాలు తీసే బాంబ్

By:  Tupaki Desk   |   5 Oct 2015 8:16 PM GMT
ఫ్లవర్ వాజ్ కాదు.. ప్రాణాలు తీసే బాంబ్
X
15 ఏళ్ల వయసులో ఉన్న ఓ బ్రిటీష్ మహిళకు ఒక ఫ్లవర్ వాజ్ లాంటి వస్తువు దొరికింది. చూసేందుకు ముచ్చటగా ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఉంచేసుకుంది. బ్రిటన్ లోని కావెంట్రీ ప్రాంతానికి చెందిన కేథరిన్.. తాను స్కూల్ లో చదివే రోజుల్లో దొరికిన ఈ ఫ్లవర్ వేజ్ అంటే ఎంతో ఇష్టం. తనకు దొరికిన ఫ్లవర్ వేజ్ ను ఇంటికి తీసుకెళ్లి దాన్ని అలంకరించి మురిసిపోయేది.

అలా ఒక రోజు కాదు.. రెండు రోజులుకాదు దాదాపు 30 ఏళ్లు గడిచాయి. ప్రస్తుతం కేథరిన్ కు 45 ఏళ్లు. పెళ్లి అయి.. ప్రశాంతంగా బతికేస్తుంది. ఓ రోజు టీవీలో డాక్యుమెంటరీ చూస్తున్నఆమెకు.. అందులో కనిపించిన వస్తువు ఒకటి చూసి షాక్ తింది. సందేహంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేసిన ఆమె.. టీవీలో వచ్చిన డాక్యుమెంటరీలో కనిపించిన వస్తువు లాంటిదే తనకు 30 ఏళ్ల క్రితం దొరికిందని చెప్పిన ఆమె మాటల్ని విన్న పోలీసులు ఆ వస్తువును జాగ్రత్తగా పరిశీలించి.. దాన్నో ఫిరంగి గుండుగా తేల్చాడు.

అది కానీ పేలితే.. దాని ప్రభావం 20 మీటర్ల ప్రాంతాన్ని విధ్వంసం చేసేస్తుందని చెప్పిన పోలీసుల మాటకు కేథరిన్ నోట మాట రాని పరిస్థితి. ఇద్దరు పిల్లల తల్లి అయిన కేథరిన్ పోలీసులు చెప్పిన మాటకు షాక్ తింది. వెంటనే దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని నిర్వీర్యం చేశారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి ఒక పేలని ఫిరంగి గుండును.. ఫ్లవర్ వాజ్ గా 30 ఏళ్లు తనతో ఉంచుకున్నా.. అది పేలకపోవటానికి మించిన అదృష్టం ఇంకేం ఉంటుంది. ఈ ఘటన గురించి తెలిసిన వారంతా విస్మయానికి గురి అవుతున్న పరిస్థితి. సదరు మందగుండును నిర్వీర్యం చేసిన పోలీసులు తిరిగి మళ్లీ దాన్ని కేథరిన్ కు అప్పగించటం కొసమెరుపుగా చెప్పొచ్చు. ఫిరంగి గుండును ఫ్లవర్ వాజ్ గా పెట్టుకున్న ఈ మహిళ ఉదంతం ఇప్పుడు పెద్ద ఎత్తున ఆసక్తి రేపటమే కాదు.. అదృష్టానికి నిలువెత్తు రూపంగా పలువురు అభివర్ణిస్తున్నారు.