Begin typing your search above and press return to search.

క‌త్తి మాట‌!..న‌న్ను తిట్టే ప్ర‌తి బూతూ ప‌వ‌న్ పైకే!

By:  Tupaki Desk   |   22 April 2018 7:30 AM GMT
క‌త్తి మాట‌!..న‌న్ను తిట్టే ప్ర‌తి బూతూ ప‌వ‌న్ పైకే!
X
మొన్న‌టిదాకా టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ - జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ కల్యాణ్‌ - సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేశ్‌ మ‌ధ్య యుద్ధం ఓ రేంజిలో జ‌రిగింది. సోష‌ల్ మీడియా - టీవీ ఛానెళ్ల వేదిక‌గా జరిగిన ఈ వార్ లో ఎంద‌రెంద‌రో ఎంట్రీ ఇచ్చినా... ప‌వ‌న్ - మ‌హేశ్ లే హైలెట్ అయ్యారు. ఈ యుద్ధంలో మ‌రో కోణం కూడా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అందేంటంటే... ఈ వార్ ఆఫ్ వ‌ర్డ్స్ లో క‌త్తి మ‌హేశ్ చాలా ఆవేశ‌పూరితంగా మాట్లాడి సింగిల్ ఎపిసోడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్‌ గా మార‌డ‌మే కాకుండా ఒక్క దెబ్బ‌కు ప్ర‌ముఖ వ్య‌క్తిగా మారిపోగా... అస‌లు ఈ విష‌యంలో ఒక్క మాట కూడా అన‌ని ప‌వ‌న్ మాత్రం బ‌ద్నాం అయిపోయారన్న వాద‌న వినిపించింది. ప‌వ‌న్ త‌ర‌ఫున ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ బ‌రిలోకి దిగ‌గా... కత్తి మ‌హేశ్ మాత్రం అంద‌రినీ ఎదుర్కొనే ఒకే ఒక్క‌డిలా త‌న‌దైన శైలిలో చ‌క్రం తిప్పేశాడు. ఇక ఏదో ఒక ఇష్యూ కావాల‌ని ఆతృత‌గా ఎదురు చూసే మీడియా ఛానెళ్ల‌కు మాత్రం ఈ వివాదం ఓ బూస్ట‌నే చెప్పాలి.

ఆ వివాదం ఎలాగోలా స‌ద్దుమ‌ణ‌గ‌గా... ఇప్పుడు టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ను అంత‌మొందించేందుకంటూ రంగంలోకి దిగిన న‌టి శ్రీ‌రెడ్డి వివాదం తారాస్థాయికి చేరుకుంది. న‌డిరోడ్డుపై బూతులు మాట్లాడుకునే స్థాయికి పరిస్థితి చేర‌గా... మీడియా ఛానెళ్లు మాత్రం ఇంత‌కంటే మంచి త‌రుణం ఇంకేముందంటూ ఆ బూతుల‌ను యాజిటీజ్‌గా ప్ర‌సారం చేసేస్తూ రాక్ష‌సానందం పొంందుతున్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఈ వివాదం ఎప్పుడు స‌ద్దుమ‌ణుగుతుందిరా బాబూ అనుకుంటున్న వేళ... ఇప్పుడు ప‌వ‌న్‌ - క‌త్తి మ‌హేశ్ ల మ‌ధ్య వివాదం మ‌రోమారు ఎగ‌సిప‌డింద‌నే చెప్పాలి. మొన్న‌టికి మొన్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌ గా చెప్పుకున్న ఓ వ్య‌క్తి సోష‌ల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ కు చాలా వేగంగానే రియాక్ట్ అయిన క‌త్తి మ‌హేశ్‌... త‌న‌ను ఇక‌పై కెల‌కొద్ద‌ని ముంద‌స్తుగా వార్నింగ్ ఇచ్చాడు. తాను సైలెంట్‌ గా ఉన్నాన‌ని - త‌న‌ను ఏమాత్రం కెలికినా తాను కూడా ఎంత‌మాత్రం సైలెంట్ గా ఉండేది లేద‌ని కూడా క‌త్తి మ‌హేశ్ వార్నింగ్ ఇచ్చాడు.

ఇది జ‌రిగి కేవ‌లం రెండంటే రెండు రోజులు గ‌డిచిందో - లేదో... అనూహ్యంగా మ‌రోమారు క‌త్తి మ‌హేశ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పెట్టిన ఓ వార్నింగ్ ఇప్పుడు వైర‌ల్ గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అస‌లు ఏం జ‌రిగిందో తెలియదు గానీ... ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పాటు ఆయ‌న ఫ్యాన్స్ కు కూడా స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చాడు. అన‌వ‌స‌రంగా ఎవ‌రి జోలికీ వెళ్లొద్ద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ఫ్యాన్స్‌ కు చెప్పిన విష‌యాన్ని ప్ర‌స్తావించిన క‌త్తి మ‌హేశ్‌... ప‌వ‌న్ స‌ల‌హాను ఫ్యాన్స్ ఫాలో కావ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఈ క్ర‌మంలో తాను కూడా కామ్‌ గా కూర్చునేది లేద‌ని తేల్చేసిన మ‌హేశ్‌... త‌న‌ను ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ తిట్టే ప్ర‌తి బూతును తాను ప‌వ‌న్ క‌ల్యాణ్‌ పైకి విసురుతాన‌ని ప్ర‌క‌టించేశాడు. ట్విట్ట‌ర్ వేదిక‌గా క‌త్తి మ‌హేశ్ చేసిన ఈ వార్నింగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారిపోయింద‌ని చెప్పాలి.

క‌త్తి మ‌హేశ్ త‌న ట్వీట్ లో ఏమ‌న్నాడ‌న్న విష‌యానికి వ‌స్తే... *నిన్ననే పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్‌ కి అనవసరంగా కెలుక్కోకండి అని సలహా యిచ్చాడు. అయినా ఫ్యాన్స్ ఫాలో అవ్వడం లేదు. కాబట్టి, ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను తిట్టే ప్రతి బూతూ నేను పవన్ కళ్యాణ్ ని తిడతాను. ఓకేనా! మారండి. లేకపోతే, మీ అశుద్ధం రుచి మీ పవన్ కళ్యాణ్ చూస్తాడు* అంటూ కత్తి మహేష్ ఘాటు హెచ్చ‌రిక‌లు చేశాడు. ఈ ట్వీట్ చూస్తుంటే... కాస్టింగ్ కౌచ్ వివాదం స‌ద్దుమ‌ణ‌గ‌క ముందే... మ‌రోమారు ప‌వ‌న్‌ - క‌త్తి మ‌హేశ్ ల మ‌ధ్య వివాదం రేగేలానే ఉంద‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.